Ravanasura Glimpse: ఊహించని లుక్‌లో రవితేజ.. పుట్టినరోజున ఫ్యాన్స్‌కు వైల్డ్ గిఫ్ట్
కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులనే బేరీజు వేసుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన అతడు.. చాలా కష్టాల తర్వాత స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. గత ఏడాది పరాజయాలతో సతమతమైన ఈ స్టార్ హీరో.. డిసెంబర్‌లో వచ్చిన 'ధమాకా'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో చిరంజీవితో కలిసి సందడి చేశాడు. ఇది ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులు సాధించింది.
వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'రావణాసుర' అనే చిత్రంలో నటిస్తోన్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 2022 సంక్రాంతి పండుగకు ప్రారంభించారు. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. ఇలా ఇప్పటి వరకూ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుని దాదాపుగా టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 26వ తేదీ) మాస్ మహారాజా పుట్టినరోజును జరుపుకుంటోన్నాడు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు.
రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం 'రావణాసుర' నుంచి తాజాగా గ్లింప్స్ వీడియో విడుదలైంది. ఇందులో అమ్మాయిల మర్డర్స్ జరుగుతుండడం.. ఆ బ్యాగ్రౌండ్‌లో రవితేజ ముఖం కనిపించడాన్ని చూపించారు. అలాగే, Heroes Don't Exist (హీరోలనే వారు ఉండరు) అనే క్యాప్షన్‌ను కూడా హైలైట్ చేశారు. మొత్తంగా ఈ వీడియోలో రవితేజను ఎంతో వైల్డుగా, స్టైలిష్‌గా చూపించారు. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో 'రావణాసుర' గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. రవితేజ 'రావణాసుర' ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రను చేస్తోన్నాడు.


Click it and Unblock the Notifications











