HBD Shruti Hassan: ప్రభాస్ గర్ల్‌ఫ్రెండ్‌ పరిచయం.. పేరు రివీల్ చేసిన సలార్ యూనిట్

ఆకట్టుకునే అందం.. మైమరపించే నటనతో సుదీర్ఘ కాలంగా దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. లెజెండరీ హీరో విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనలోని టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. మధ్యలో చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చినా.. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చేతి నిండా సినిమాలను చేస్తూ యమ బిజీగా గడుపుతోంది.

హాట్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో పలుమార్లు చిత్రీకరణకు ఆటంకం ఏర్పడింది. దీంతో షూట్‌కు చాలాసార్లు బ్రేక్ పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ డేట్స్‌ను బట్టి షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటోంది చిత్ర యూనిట్.

HBD Shruti Hassan: Salaar Team Special Wishes to Shruti Hassan

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర ఎంతో కొత్తగా వైవిధ్యంగా ఉంటుందని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇందులో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటిస్తుందని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, శృతి హాసన్ పాత్రకు చాలా ప్రాధాన్య కూడా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆమె లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అంతా అనుకున్నారు. ఇక, ఈ పాత్ర కోసం శృతి హాసన్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటోందని.. సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

శృతి హాసన్ ఈరోజు (జనవరి 28) పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 'సలార్' మూవీ యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు, ఈ సినిమాలో ఈ హీరోయిన్ 'ఆద్య' అనే పాత్రను పోషిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసి.. రోల్‌కు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. ఇక, 'అందం, గాంభీర్యానికి చిరునామా. అత్యంత టాలెంట్ ఉన్న హీరోయిన్లలో ఒకరైన మా ఆద్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము నిన్న ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటాము' అంటూ ట్వీట్ కూడా చేశారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X