ఇట్స్ టైమ్ టు పార్టీ అంటున్న శ్రీముఖి.. పుట్టిన రోజున తుపాకి పట్టి ఫుల్ హంగామా!
యాంకర్‌గా బుల్లితెర మీద సందడి చేస్తూనే అవకాశం లభిస్తే వెండితెర మీద సత్తా చాటుతున్నది శ్రీముఖి. హోస్ట్‌గా, బిగ్‌బాస్ సెలబ్రిటీగా, సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా విశేషంగా అభిమానులను సంపాదించుకొంటున్నారు. ఇలా దూసుకెళ్తున్న టాప్ యాంకర్ మే 10వ తేదీన తన జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన ఇట్స్ టైమ్ టూ పార్టీ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. శ్రీముఖి బర్త్ డేకు సంబంధించిన మరిన్నీ వివరాల్లోకి వెళితే..

శ్రీముఖి జన్మదినం సందర్భంగా
యాంకర్, హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రీముఖి.. బుల్లితెర మీద రాములమ్మగా మరో పేరు సంపాదించుకొన్నారు. గత బిగ్‌బాస్ సీజన్‌లో ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె దాదాపు టైటిల్ ఎగురేసుకుపోయినంత పనిచేసింది. అయితే రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచినప్పటికీ.. బిగ్ బాస్ అభిమానులను శ్రీముఖి గెలచుకొన్నారు. శ్రీముఖి విజేత కావాల్సి ఉండేదనే విషయాన్ని సోషల్ మీడియాలో అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇలా అలరిస్తున్న శ్రీముఖి తన జన్మదిన సందర్భంగా అభిమానులకు మరో కానుకను ఇచ్చారు.

కీలక పాత్రలో రాములమ్మ
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. ఆదివారం (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశామని నిర్మాత వెల్లడించారు.

శ్రీముఖి అద్భుతంగా నటించారు
ఇట్స్ టైమ్ టు పార్టీ ఫస్ట్ లుక్ సందర్భంగా సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ "ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సినిమాలో శ్రీముఖి గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ, ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ ప్రైజ్ ఇస్తుంది. పాత్రలో శ్రీముఖి అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి" అని అన్నారు.
Recommended Video

ఇట్స్ టైమ్ టు పార్టీలో..
శ్రీముఖి, దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ తదితరులు
పిఆర్ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి,
ఎడిటర్: అనిల్ కుమార్ పి,
కెమెరామెన్: దిలీప్ కుమార్ ఎంఎస్,
సంగీతం: శేఖర్ మోపూరి,
సహ నిర్మాత: సిహెచ్ వేణు మాధవ్,
నిర్మాతలు: అల్లం సుభాష్, గౌతమ్ ఇవిఎస్,
దర్శకుడు: గౌతమ్ ఇవిఎస్


Click it and Unblock the Notifications











