HBD Sumanth విశాఖపట్నం రౌడీగా సుమంత్.. వాల్తేరు శీను ఫస్ట్‌లుక్ అదుర్స్
టాలీవుడ్‌లో అక్కినేని హీరో సుమంత్ సినిమాలో ఎంపికలో విభిన్నమైన శైలి. రాశి కంటే వాసిని ప్రధానంగా నమ్మే ఈ యువ హీరో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ రావే చిత్రంతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్న సుమంత్ ఆ తర్వాత ప్రేక్షకుల మెప్పించే సినిమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మళ్లీ మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన జీ 5 ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో సుమంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీకి సంబందించిన వివరాలను నిర్మాత యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి మీడియాకు రిలీజ్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బుధవారం అంటే ఫిబ్రవరి 9వ తేదీన సుమంత్ జన్మదినం జరుపుకొంటున్నారు. ఈ సంరద్భంగా వాల్తేరు శీను సినిమా పోస్టర్‌ను, సుమంత్ లుక్‌ను రిలీజ్ చేశారు. సుమంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో సుమంత్ వాల్తేర్ శీను లుక్‌కు మంచి స్పందన లభించింది.

వాల్తేర్ శీను పోస్టర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత, దర్శకులు మాట్లాడుతూ.. సుమంత్ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
రాజ్ క్రియేషన్స్ పతాకంపై యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్, ఐమా జంటగా నటించారు. ఈ చిత్రానికి మను యజ్ఞ దర్శకత్వం వహించారు. వాల్తేరు శీను చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది.
నటీనటులు: సుమంత్, ఐమా, మధు నందన్, హైపర్ ఆది, మిర్చి కిరణ్, కళ్యాణ్, ధనరాజ్, రఘు కారుమంచి, సిజ్జు, ప్రభ (సీనియర్ నటి) తదితరులు
దర్శకత్వం: మను యజ్ఞ
నిర్మాత: యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి
సంగీతం: మార్క్‌కే రాబిన్స్
పీఆర్వో: వి ఆర్ మధు


Click it and Unblock the Notifications











