బర్త్ డే సర్‌ప్రైజ్.. సునీల్ ''కలర్ ఫోటో''.. రియల్లీ ఇంట్రెస్టింగ్

నేడు (ఫిబ్రవరి 28) యాక్టర్ సునీల్ పుట్టిన రోజు. 1974 సంవత్సరం ఇదే రోజు జన్మించిన ఆయన నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47 వ పడి లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు పలువురు సినీ ప్రముఖులు.

ఇకపోతే సునీల్ పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న తాజా సినిమా 'కలర్ ఫోటో' నుంచి సునీల్ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ మేరకు సునీల్ లుక్ రిలీజ్ చేస్తూ ఆయన క్యారెక్టర్ పేరు రామరాజు అని తెలిపారు. ఈ పోస్టర్‌లో సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్.. అందరినీ ఆకట్టుకున్నాడు.

 HBD Sunil: First Look From Colour Photo

శ్రవణ్ కొంక సమర్పణలో అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టై‌న్మెంట్స్ బ్యానర్లపై సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని ఈ కలర్ ఫోటో సినిమాను నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. యం.యం.కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. 'ఛాయ్ బిస్కెట్' ఛానెల్‌తో పాపులర్ అయిన సుహాస్ ఈ 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అతని సరసన తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X