HBD Yash: యశ్ బర్త్‌డేకు అదిరిపోయే కానుక.. డేంజర్ అంటూ రిలీజ్ డేట్‌పై క్లారిటీ
కొన్నేళ్ల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలై.. దేశ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ను అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్ల సునామీని సృష్టించింది. అలాగే, జాతీయ అవార్డులను సైతం అందుకుంది. దీంతో శాండిల్‌వుడ్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇంతటి ఘన విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గా మరో మూవీ కూడా వస్తున్న విషయం తెలిసిందే.
మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీనికి సీక్వెల్ తీస్తున్నారు. కేజీఎఫ్‌ను తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా నడుస్తుంది. ఇక, ఆ అధీరా పాత్రను బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతోంది. అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడడంతో షూటింగ్ సజావుగా సాగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే దీన్ని పూర్తి చేసుకున్నారు.

'కేజీఎఫ్ చాప్టర్ 2' షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. వీటికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్ దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ సినిమాను గత ఏడాదే విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని 2022, ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆరోజునే విడుదల కావాల్సి ఉన్న ప్రభాస్ 'సలార్' వాయిదా పడింది. ఈ రెండు సినిమాలనూ హొంబళే ఫిల్మ్స్ సంస్థే నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండడంతో చాలా సినిమాలు వాయిదా పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' కూడా మరోసారి పోస్ట్‌పోన్ అవబోతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈరోజు (జనవరి 8) హీరో యశ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని తాజాగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఇందులో 2022, ఏప్రిల్ 14నే రాబోతుందని ప్రకటించింది. అంతేకాదు, 'ప్రమాదం ముందుంది' అనే హింట్‌ను కూడా ఇస్తూ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీనిపై యశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆ మధ్య విడుదలైన టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇక, ఈ సినిమాను మొదటి భాగానికి మించేలా తెరకెక్కించారని అంటున్నారు. దీంతో ఈ మూవీ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











