Kushi విజయదేవరకొండని ఓ హీరో ఫ్యాన్స్ టార్గెట్.. ఖుషిపై భారీగా ట్రోలింగ్.. 10 వేలకుపైగా..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లను భారీగా రాబడుతున్నది. అయితే విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ మూవీ కొందరి హీరోల అభిమానులు పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం వివాదంగా మారింది. అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. విజయ్ దేవరకొండపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యతిరేక ప్రచారం గురించిన వివరాల్లోకి వెళితే..

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్‌ను సంపాదించుకొన్న హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ, అభిమానులను సంపాదించుకోవడం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. విజయ్ దేవరకొండ చేసే సామాజిక సేవలు, అభిమానులతో టచ్‌లో పద్దతులు గురించి ఇండస్ట్రీ లోపల, బయట చర్చ జరిగింది.

Heavy trolling on Vijay Devarakondas Kushi movie in Book My Show>

ఇక డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండపై పనిగట్టుకొని వ్యతిరేక రివ్యూలు, వార్తలు రాయడం చేస్తున్నారనే విషయాన్ని ఆయన వర్గం బాహాటంగానే ఆరోపించింది. ఆ సినిమా నుంచి వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో వ్యతిరేక వర్గం చేసే ట్రోలింగ్ అడ్డు అదుపులేకుండా పోయింది. లైగర్ సమయంలో నెగిటివిటీ పీక్స్‌కు వెళ్లిందనే విషయం తెలిసిందే.

లైగర్ సినిమా రిలీజ్‌కు ముందే ఓ వర్గం ట్రోలింగ్‌కు దిగింది. సినిమా రిలీజ్ కాకుండానే 10 వేలకుపైగా రివ్యూ వీడియోలు పోస్టు చేశారు. దాంతో విజయ్ సోషల్ మీడియా టీమ్ దిగ్బ్రాంతికి గురైంది. సినిమా పడకుండానే కుప్పలు తెప్పలుగా వీడియోలు పోస్టు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే లైగర్ కంటెంట్ పరంగా డిజాస్టర్ కావడంతో చేసేదీ ఏమీ లేక ఊరుకుండిపోయారు.

Heavy trolling on Vijay Devarakondas Kushi movie in Book My Show>

ఇక ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే విధంగా నెగిటివిటీ ప్రచారం జరిగింది. కొందరు బుక్ మై షోలో దారుణంగా రేటింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దాదాపుగా 10 వేలకుపైగా ఊరు పేరులేని అకౌంట్స్ ద్వారా 1/10 రేటింగ్ ఇవ్వడం చూసి విజయ్ దేవరకొండ డిజిటల్ మీడియా షాక్ గురయ్యారు. బుక్ మై షోలో చెత్త రేటింగ్ ఇవ్వడమే కాకుండా అభ్యంతరకరమైన భాషతో కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. అయితే ఇలాంటి చెత్త ప్రచారం వెనుక ఎవరున్నారనే విషయంపై విజయ్ డిజిటల్ టీమ్ ఆరా తీస్తున్నారు.

Heavy trolling on Vijay Devarakondas Kushi movie in Book My Show>

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి చిత్రం ట్రోలింగ్‌ను అధిగమించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమాను టార్గెట్ చేసిన వారిలో ఓ హీరో అభిమానులు ఉన్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా మూడో రోజు ఆాదివారం కూడా భారీగా వసూళ్లను,ఆక్యుపెన్సీ నమోదు చేయడంతో ఈ సినిమా 100 కోట్లకు చేరువ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X