మూగ యువతిగా హెబ్బా పటేల్.. గీత పాత్రతో క్రేజీగా వెండితెరపై...
క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ తన కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో లక్కీ గర్ల్‌గా పేరు సంపాదించుకొన్నది. అయితే ఇటీవల కాలంలో కాస్త హిట్ల జోరు తగ్గినా.. స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకొన్నది. అయితే తన కెరీర్ మొత్తంలో చేయనటువంటి పాత్రతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. గీత అనే చిత్రం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమైంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

సంచలన దర్శకులు వీవీ వినాయక్ శిష్యుడు విశ్వ ఆర్ రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్ రాచయ్య నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం గీత. మ్యూట్ విట్నెస్ ఉప శీర్షిక. నిర్మాతగా ఆర్ రాచయ్యకు తొలిచిత్రం.
హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ హీరోగా నటిస్తుండగా... "నువ్వే కావాలి, ప్రేమించు" చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వీవీ వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.
రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం.
నటీనటులు: సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ ఆర్ రావు
నిర్మాత: ఆర్ రాచయ్య
పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్
పాటలు: సాగర్
సంగీతం: సుభాష్ ఆనంద్
ఫైట్స్: రామ్ కిషన్
ఆర్ట్స్: జె.కె.మూర్తి,
సినిమాటోగ్రఫి: క్రాంతికుమార్ కే
ఎడిటింగ్: ఉపేంద్ర,
కో-డైరెక్టర్: వీవీ రమణ
పీఆర్వో: ధీరజ్-అప్పాజీ


Click it and Unblock the Notifications











