నరుక్కోవడం నుంచి నవ్వుకొనే వరకు.. ధూం ధాం పైసా వసూల్ మూవీ
యువ హీరో, హీరోయిన్లు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ధూం ధాం. పెళ్లి కథాంశం సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శ్రీనివాస్ రావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. ధూం ధాం సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందించారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానున్నది. తాజాగా హైదరాబాద్ లో ధూం ధాం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రముఖులు మాట్లాడుతూ..
రోజుకో సినిమా వేషం సంపాదించాలనే కళలో నిపుణుడిని అయ్యాను. మంచి ఉద్యోగం విడిచిపెట్టి సినిమా రంగానికి వచ్చాను. దాంతో రోజుకో వేషం చేయనిదే నాకు నిద్రపట్టదు. ఎలాగో పెద్ద ఉద్యోగం వదిలేసామనే భయం ఓ పక్క ఉండేది. ఈ సినిమా స్టార్ట్ అయ్యేముందు రాఘవేంద్రరావు ముందు నిర్మాత రామ్ కుమార్ మాట ఇచ్చాడు. కానీ ఆయన పోలెండ్ వెళ్లిపోయాడు. దాంతో నాకు టెన్షన్ పట్టుకొన్నది. నాకు వేషం ఇస్తానని చెప్పి పోలెండ్ వెళ్లిపోయాడు. నాకు ఫోన్ రావడం లేదు అని శ్రీనివాసరావు అన్నారు.

నేను అలా టెన్షన్‌లో ఉండగా, చివరకు రామజోగయ్య శాస్త్రి ఫోన్ చేసి మీకు ధూం ధామ్ సినిమాలో వేషం ఉంది. వెన్నెల కిషోర్‌కు తండ్రిగా చేయాల్సి ఉందని చెబితే.. నాకు వేషం పడిందని హ్యాపీగా ఫీలయ్యాను. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వేషం ఇచ్చినందుకు గోపిమోహన్, నిర్మాత రామ్ కుమార్‌కు ధన్యవాదాలు అని అన్నారు.
ధూమ్ ధామ్ సినిమా విషయానికి వస్తే.. నరుక్కోవడం నుంచి నవ్వుకోవడానికి జరిగే ప్రయాణం ఈ సినిమా కథ. ఈ మద్య సినిమాల్లో నరుక్కోవడం ఎక్కువగా ఉంటున్నాయి. తెలుగు సినిమాలు చూడలేకపోతున్నామని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటి ఫీలింగ్ లేకుండా చక్కగా నవ్వుకొనే సినిమా ఇది. తప్పకుండా ఓటీటీలో చూడండి అని శ్రీనివాసరావు అన్నారు.

నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ.. ధూం ధాం సినిమాకు మా టీమ్ అంతా మనసు పెట్టి పనిచేశారు. రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం ఇచ్చారు. గోపీ సుందర్ ఛాట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. మా అబ్బాయి చేతన్‌ను హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది. హెబ్బా పటేల్ బాగా నటించింది. గోపీ మోహన్, సాయి కిషోర్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సినిమా తెరకెక్కించారు. వారికి థ్యాంక్స్. ధూం ధాం సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీరంతా సకుటుంబంగా వచ్చి ఈ నెల 8వ తేదీన మూవీ చూడండి అని అన్నారు
డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ ధూం ధాం" సినిమాలో ఫస్ట్ సాంగ్స్ బాగున్నాయనే టాక్ వచ్చింది. అందుకు గోపీ సుందర్, రామజోగయ్య థ్యాంక్స్ చెబుతున్నా. సినిమా షూటింగ్‌లో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు.ఈ సినిమా చూసిన వారంతా బాగా నవ్వుకుంటారు. మీ టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం. సినిమా మేకింగ్ మొత్తం రామ్ కుమార్ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా కోసం ఏది అడిగినా, ఎంత బడ్జెట్ అయినా ఇచ్చారు. వారి ఇంట్లో అయినా, పోలెండ్ లో అయినా ఒకేలా చూసుకున్నారు. ఈ సినిమా చేతన్ కు మంచి పేరు తేవాలి కోరుకొంటున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











