twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘హ‌లో గురు ప్రేమ కోస‌మే... ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

    |

    ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ హ‌లో గురు ప్రేమ కోస‌మే. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు.

    ఈ చిత్రాన్ని ఆగస్టు 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఆగస్టు 10న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు.

    Hello Guru Prema Kosame pre-release event on Oct 13th

    నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంది. మా బ్యాన‌ర్‌లో ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతం అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది.' అన్నారు.

    ఈ నెల 10న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. అలాగే అక్టోబ‌ర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హిస్తున్నాం. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రానికి విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు.బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు.. ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు.

    English summary
    'Hello Guru Prema Kosame' pre-release event on Oct 13th In Vizag. Hello Guru Prema Kosame is a Telugu movie starring Ram Pothineni and Anupama Parameshwaram. It is a drama directed by Trinadha Rao Nakkina.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X