కాఫీ ఎలా ఉంది.. హాట్‌గా ఉంది.. పిచ్చ రొమాంటిక్‌గా హలో గురు ప్రేమ కోసమే టీజర్!
హీరో రామ్, అనుపమ జంటగా నటిస్తున్న నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదుల చేశారు. నేను లోకల్ చిత్రంతో విజయాన్ని అందుకున్న త్రినాథ్ రావు మరో మారు అదే జోనర్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు.
అనుపమ నడుము వంక రామ్ దొంగచూపులు చూస్తుండగా వారి మధ్య సాగే సంభాషణ ఆకట్టుఉంటోంది. నీ కోసమే ఈ కాఫీ ఎలా ఉంది అని అనుపమ అడుగుతుంది. రామ్ హాట్ గా ఉంది అంటూ కొంటెగా సమాధానం ఇస్తాడు.

రామ్, అనుపమ పరమేశ్వరన్ కలసి నటించడం ఇది రెండవసారి. ఇప్పటికే ఈ జంట ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంలో కలసి నటించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 న విడుదుల చేయనున్నట్లు తెలుస్తోంది. నేను శైలజ చిత్రం తరువాత రామ్ మళ్ళీ పరాజయాల బాట పట్టాడు. హలో గురు ప్రేమ కోసమే చిత్రంపై టీం మొత్తం ధీమాతో ఉంది.


Click it and Unblock the Notifications











