గీతాంజలి భౌతిక కాయానికి ఘన నివాళి.. కన్నీరు మున్నీరైన హేమ
సీనియర్ నటి గీతాంజలి మరణం సినీ లోకంలో విషాద ఛాయలు నింపింది. గుండెపోటుతో ఆమె మరణించిందనే వార్త తెలియగానే.. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెను కడసారి చూసేందుకు వెళ్లి కన్నీటి నివాళి అర్పించారు.
సీనియర్ నటి గీతాంజలికి గురువారం ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గీతాంజలి తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఆమె నివాసానికి తరలించి.. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం తగిన ఏర్పాట్లు చేశారు.

కొద్దిసేపటి క్రితం ఆమె మృతదేహాన్ని సందర్శించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఉత్తేజ్, హేమ, రమాప్రభ, శివాజీ రాజా తదిరులు ఘన నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. మరీ ముఖ్యంగా హేమ కన్నీరు మున్నీరైంది. గీతాంజలి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని హేమ పేర్కొంది. గీతాంజలితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుమిలి పోయింది హేమ. ఇక గీతాంజలికి నివాళుర్పించిన వారిలో దివంగత నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications











