బిగ్ బాస్ హౌస్‌లో హేమ.. అప్పుడే సందడి మొదలెట్టిందిగా
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో పదవ కంటిస్టెంట్ గా హేమ అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. హేమ గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

నటి హేమ..ప్రేక్షకులకు ఎప్పటి నుంచో సుపరిచితం. పలు సినిమాల్లో కామెడీ పండించి పాపులర్ నటిగా పేరు గడించిన ఈమె ఇటీవలి కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. ఇటీవలే తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. సినిమాల్లో హేమ నటన, వాక్చాతుర్యం బాగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్. కొద్ది రోజుల క్రితమే తాను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఇన్ డైరెక్ట్ హింట్స్ ఇచ్చిన హేమ నూతనోత్సాహంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. నాగార్జునకు ముద్దులిస్తూ బిగ్ బాస్ హౌస్‌లో ఎంటరైంది హేమ.


Click it and Unblock the Notifications











