‘ఆదిపురుష్’లో సీనియర్ హీరోయిన్ కీలక పాత్ర: ప్రభాస్ తల్లి అని అంటున్నారే
తెలుగు హీరోగా ఇంత కాలం అలరించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇటీవలి కాలంలో వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. తద్వారా దేశ వ్యాప్తంగా తన స్టామినాను నిరూపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు 'ఆదిపురుష్' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'లో రావణుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అలాగే, ఇందులో సీతగా టాల్ బ్యూటీ కృతీ సనన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమ మాలినీ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఆమె ఈ సినిమాలో చేసేది ప్రభాస్ (రాముడి పిన తల్లి కైకేయి) తల్లి పాత్ర అని కూడా అంటున్నారు. దీంతో ఈ సినిమాకు అదనపు ఆకర్షణ రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

ఇక, ఈ సినిమాలో అత్యంత కీలకమైన లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ అనే యంగ్ హీరో పోషిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవల ఈ పాత్రకు కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందించబోతున్నాడట దర్శకుడు ఓం రౌత్. ఇందుకోసం ప్రత్యేకమై టీమ్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశాడు. అంతేకాదు, దీని కోసమే దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేయబోతున్నారని, విదేశాలకు చెందిన రెండు బడా సంస్థలు ఈ పనులు చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











