మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఆలస్యం కానుందా!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. నందమూరి అభిమానులంతా 2019లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని భావిస్తున్న తరుణంలో ఇది వారికీ కాస్త నిరాశకలిగించే అంశమే. మోక్షజ్ఞ తన నటన, మేకోవర్ ఇలా హీరోకి కావలసిన అన్ని అంశాలపై శిక్షణ పొందుతున్నాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అయిన తరువాతే సినిమా ప్రారంభం అవుతుందని బాలయ్య తన కుమారుడితో చెప్పాడట.
ఏ విషయంలో కూడా అభిమానులని నిరాశపరచకుండా ఉండేందుకు మోక్షజ్ఞ డాన్సులు, హార్స్ రైడింగ్ ఇలా అన్ని అంశాలలో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సరిపోయే కథ దొరికితే లాక్ చేద్దాం అని బాలయ్య భవిస్తున్నాడు. క్రిష్ లాంటి దర్శకులు మోక్షజ్ఞని లాంచ్చేయడానికి ఆసక్తిగా ఉన్నారట.

మొదట బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఓ పాత్ర చేయించడం ద్వారా మోక్షజ్ఞని టాలీవుడ్ కు పరిచయం చేయాలని ఆనుకునట్లు తెలుస్తోంది. కానీ చివరి నిమిషంలో బాలయ్య ఆ ఆలోచన విరమించుకున్నారట. సోలో హీరోగానే మోక్షజ్ఞని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నందమూరి యువ వారసుడి కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











