ఆకట్టుకుంటున్న ‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ లుక్
సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో బన్ని వాస్ నిర్మాతగా అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం "ప్రతిరోజు పండగే". తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.
చిత్రలహరితో చాలా కాలం తర్వాత విజయం అందుకున్న సాయి తేజ్.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు హిట్ చిత్రాలకు చేసిన మారుతి దర్శకత్వం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా కలిసి నటిస్తుండటం కూడా ఈ సినిమాపై క్రేజ్ పెరగడానికి మరో కారణం.

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా జీఏ2-యూవీ పిక్చర్స్ సంస్థగా ఏర్పడి సినిమాలను నిర్మిస్తున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ పర్యవేక్షణలో బన్నీవాస్, వంశీ, ప్రమోద్, విక్కీలు సారధ్యంలో ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి.
ఈ చిత్రంలో సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు
సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం - మారుతి దాసరి
సమర్పణ - అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ - బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ - ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ - తమన్ .ఎస్
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ - రవీందర్
ఎగ్జీక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
డిఓపి - జైకుమార్ సంపత్


Click it and Unblock the Notifications











