VarunLuv ఒక్కటైన వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి.. లవ్ ప్రపోజల్ నుంచి పెళ్లిపీటల వరకు..!
లావణ్య త్రిపాఠి.. పేరుకు తగ్గట్లే అందం.. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ అందాల రాక్షసి సినిమాలో క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో యూత్ మనసును దోచేసింది. ఇక ఆరడుగుల అందగాడు.. మెగా ఫ్యామిలీ ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఈ అందాల రాక్షసితో ప్రేమలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఏకంగా ఐదు సంవత్సరాలు వీరు సీక్రెట్ గా ప్రేమించుకుని.. ఈరోజు అనగా నవంబర్ 1వ తేదీన పెళ్లితో ఒకటయ్యారు. వీరి ప్రేమ ప్రయాణం నుంచి పెళ్లి వరకు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2017లో 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్, లావణ్యల మధ్య పరిచయం ఏర్పడగా... ఆ సినిమా సమయంలో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఇక ఆ సినిమా కూడా ఇటలీలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ జంటకు ప్రేమ అడుగు ఇటలీలోనే పడిందని తెలుస్తోంది. ఇక మిస్టర్ సినిమా చేదు ఫలితం ఇచ్చినా.. ఆ తర్వాత వీరు ఇద్దరు కలిసి నటించిన అంతరిక్షం సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక అంతరిక్షం సినిమా సమయంలోనే వీరు ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా మారిపోయారు.

లావణ్య ప్రేమలో పడిపోయిన వరుణ్ తేజ్.. ఆమె బర్త్ డే రోజునే లవ్ ప్రపోజల్ పెట్టాడు. ఇక మొదట లవ్ ప్రపోజ్ చేసింది వరుణ్. ఇక ఆ తర్వాత వరుణ్ ప్రేమను అంగీకరించిన లావణ్య... ఐదుళ్లుగా వీరి ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. వీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కాడా కెమెరాల కంటికి కనబడలేదు. మరోవైపు నిహారికతో కూడా ఈ భామ స్నేహం చేస్తూ.. మెగా కుటుంబానికి దగ్గరయింది. నిహారిక పెళ్లిలోనూ ఈ భామ సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ బంధంతో ప్రయాణం మొదలుపెట్టి... మొత్తానికి పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ఫోటోను నాగబాబు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. కొత్తగా పెళ్లయిన వరుణ్ తేజ్ కొణిదెల మరియు లావణ్య కొణిదెల కోసం మీ ఆశీస్సులు కోరుతున్నాను... అంటూ రాసుకువచ్చారు. ఆ ఫోటోలో లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి బట్టల్లో ఉన్నారు. పెళ్లి అనంతరం సూర్యునికి నమస్కారం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్స్.. వారిని ఆశీర్వదిస్తూ కామెంట్స్ చెస్తున్నారు. పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరోవైపు పెళ్లి మండపానికి వరుణ్ తేజ్ వచ్చే వీడియోలు మాత్రం వైరల్ గా మారాయి. ఒక కారులో వరుణ్ తేజ్ ను మండపం దగ్గరకు తీసుకు రాగా... వీటితో పాటు విందు భోజనాలు ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఈ పెళ్లి అనంతరం రాత్రికి అక్కడే రిసెప్షన్ కూడా జరగనుంది.

ఇక ఇటలీ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక నవంబర్ 5న సినీ రాజకీయ ప్రముఖులు, బంధువుల కోసం ఓ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











