ప్రభాస్, పవన్ .. ఇద్దరిలో ఎవరితో ? హాట్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్
తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మందే కనిపిస్తారు. ఆ తర్వాతి నుంచి వరుస ఆఫర్లులో టాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా వెంటవెంటనే జరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలాంటి యంగ్ అండ్ టాప్ హీరోయిన్స్‌లో ఇస్మార్ట్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరు. నిధి తన అంద చందాలతో యువత మనసు కొల్లగొట్టింది.
మిడ్ రేంజ్ హీరోస్ నుంచి టాప్ స్టార్ హీరోస్ తో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోన్న "హరిహర వీరమల్లు" కూడా ఒకటి. మరి ఈ సినిమాలో నిధి అగర్వాల్ తన పేరుకు తగ్గ సాలిడ్ రోల్ చేస్తోందట. కానీ పవన్ బిజీ మూలాన సినిమా చాలా కాలం పాటు ఆగిపోయే సరికి నిధి అగర్వాల్ కూడా ఖాళీ గానే ఉండిపోయింది.

ఈ సినిమాతో పాటు మరో బిగ్ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో చేస్తుంది నిధి. ఆ సినిమానే "ది రాజా సాబ్". ప్రస్తుతానికి ఇద్దరు టాప్ హీరోస్ అది కూడా ఇద్దరితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఒకేసారి చేస్తూ నిధి అగర్వాల్ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. ఒక పక్క వీరమల్లు, ఇంకో పక్క రాజా సాబ్ సినిమాలతో మంచి డెడికేషన్ చూపిస్తుంది అని మెగా నిర్మాత ఎస్ కె ఎన్ కూడా నిధి అగర్వాల్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.
లేటెస్ట్ గా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చిన్న చాట్ సెషన్ ని పెట్టింది. ఇందులో ఆమెకి పవన్ హరిహర వీరమల్లు, ప్రభాస్ తో చేస్తున్న ది రాజా సాబ్ ల గురించి ప్రశ్న ఎదురైంది. ఇద్దరు టాప్ హీరోస్ తో చేస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా ఏ రోల్ మీకు బాగా ఇష్టం అని ప్రశ్నించారు. దానికి ఆమె తెలివిగా నాకు ఇదే ఇష్టం, ఇది ఇష్టం లేదు అన్నట్టు సమాధానం ఇవ్వకుండా రెండూ మీకు నచ్చుతాయి అంటూ తప్పించుకుంది.
ఒక సినిమా రోల్ నే హైప్ ఇచ్చి చెబితే మరో సినిమాని తక్కువ చేసినట్టే అవుతుంది. కానీ ఈమెకి ఎక్కువ స్కోప్ హరిహర వీరమల్లు లోనే ఉన్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది. ది రాజా సాబ్ లో అయితే నిధి అగర్వాల్ తో పాటుగా మరింతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. సో వీరమల్లు ఈమె కెరీర్‌కి బాగా ప్లస్ కావచ్చని చెప్పొచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఇద్దరు టాప్ హీరోస్ తో నిధి అగర్వాల్ నటించడం ఇదే మొదటి సారి. మరి ఈ సినిమాలు ఆమె కెరీర్‌కి ఎంతవరకు ప్లస్ అవుతాయి అనేది చూడాల్సిందే. ఇక ఈ సినిమాలు మినహా నిధి అగర్వాల్ నుంచి మరో సినిమాలు లేనట్టు తెలుస్తుంది. సో వీటి పైనే ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











