Pushpa 2: దేవి శ్రీ ప్రసాద్‌ను అందుకే మార్చారా? పుష్ప 2 మూవీలో ఆ గొడవలే కారణమా?
తెలుగు సినిమా దగ్గర సినిమాల్లోని అన్ని అంశాలతో పాటుగా మన వాళ్ళకి సంగీతం అలాగే సినిమాల్లో పాటలు కూడా ఎంతో కీలకం అని తెలిసిందే. సరైన పాట లేకపోతే ఆ సినిమాకి అందమే లేదు అనుకుంటారు మనవాళ్ళు. అలా టాలీవుడ్ మ్యూజిక్ హిస్టరీలో ఒకో సంగీత దర్శకునికి ఒకో బ్రాండ్ ఉంది.
మరి అలా తెలుగు సినిమా దగ్గర తన సంగీతానికి అంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ని సెట్ చేసుకున్న సంగీత దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పొచ్చు. కాగా దేవిశ్రీ ప్రసాద్ ఇన్నేళ్ళలో ఎన్నో సినిమాలకి వర్క్ చేసాడు అలాగే పాటలు సహా పలు సినిమాలకి నేపథ్య సంగీతాన్ని కూడా అందించాడు. అయితే ఇన్నేళ్ల సమయంలో ఎప్పుడు జరగని అవమానం ఇప్పుడు జరిగింది అని పలు షాకిఇంగ్ వార్తలు ఈ మధ్య బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఇపుడు దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమా "పుష్ప 2" కూడా ఒకటి. ఇది సీక్వెల్ అనే కాకుండా బన్నీ, సుకుమార్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ అంటేనే తెలుగు సినిమాలో ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ఒక కాంబినేషన్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తప్పించడం అనేది ఒకింత అందరికీ షాకింగ్ గానే మారింది అని చెప్పాలి.
అయితే ఇపుడు దీనిపై ఊహించని ట్విస్ట్ తెలుస్తుంది. కాగా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తో పాటుగా రీసెంట్ ఇంకో పాన్ ఇండియా సినిమా "కంగువా" కి కూడా సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక ఈ సినిమాలో తన బిజీఎం కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పై పెచ్చు ఈ సినిమా మూలానే పుష్ప 2 దర్శకుడు సుకుమార్ కి తనకి అంతర్గత కలహాలు వచ్చాయని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కంగువా పనుల్లో పడి పుష్ప 2 కి సరిగ్గా వర్క్ అందించట్లేదు అని సుకుమార్ కి దేవికి ఏదో గొడవ అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. దీనితో ఇక మేకర్స్ చేసేది ఏమి లేక పాటలు వరకు దేవిని ఉంచుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మాత్రం థమన్, అజనీష్ అలాగే సామ్ సి ఎస్ అంటూ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా దేవిని తప్పించడానికి అయితే ఇదే ప్రధాన కారణం అన్నట్టుగా ఇపుడు అంటున్నారు.
మరి ఇది ఎంతవరకు నిజం అనేది మున్ముందు తెలియాల్సి ఉంది. ఇక ఈ బిగ్గెస్ట్ సినిమాలో ఆల్రెడీ యంగ్ హీరోయిన్ శ్రీలీల సాలిడ్ ఐటెం సాంగ్ ని రీసెంట్ గానే పూర్తి చేసుకోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పుష్ప రాజ్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమా ఈ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 6 భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











