సుప్రియనే నిర్మాతగా ఎందుకంటే? డెకాయిట్ గురించి అడవి శేష్ ఎమోషనల్

యంగ్ హీరో, హీరోయిన్లు అడివి శేష్, మృణాల్ థాకూర్ జంటగా రూపొందుతున్న చిత్రం డెకాయిట్. ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలోియో సంగీతం, కొడవాటి పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏ విజయ్ యాక్షన్ డైరెక్టర్‌గా, విజయ్ పీ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్న క్రమంలో డెకాయిట్ టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఈ ప్రెస్ మీట్‌లో ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నకు అడివి శేష్ సమాధానం ఇస్తూ..

Hero Adivi Sesh clarity on Why Supriya Yarlagadda

సాధారణంగా నా సినిమాకు ఎక్కువ సమయం తీసుకొంటాను. ఈ చిత్రం పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. దాదాపు 150 రోజులు షూటింగ్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఉంది. ఈ సినిమాను ఎక్కువ రోజులు షూట్ చేయడానికి ప్రధాన కారణం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేయడం వల్ల కొంత ఎక్కువ సమయం తీసుకొన్నది అని శేష్ పేర్కొన్నారు.

Also Read
'మగాళ్లంటే నాకు టిష్యూ పేపర్‌తో సమానం.. వాళ్లతో గడపడమంటే పక్కా ఫూలిష్’
'మగాళ్లంటే నాకు టిష్యూ పేపర్‌తో సమానం.. వాళ్లతో గడపడమంటే పక్కా ఫూలిష్’

ఈ చిత్రం కథ డిమాండ్ చేయడంతో ఎక్కువ సెట్స్ వేయాల్సి వచ్చింది. ఇండోర్‌లోనే సెట్స్‌లో షూట్ చేశాం. ఈ విషయంలో బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. క్వాలిటీ ప్రొడక్ట్ అందించాలని యూనిట్ అంతా పనిచేసింది. ఈ సినిమా విషయంలో అందరం కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకొన్నాం. ఈ సినిమా పక్కాగా జెన్యూన్ ప్రాజెక్ట్ అని అడవి శేష్ తెలిపారు.

Recommended For You
Ustaad Bhagat Singh Critic Review: ఉస్తాద్ భగత్ సింగ్ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
Ustaad Bhagat Singh Critic Review: ఉస్తాద్ భగత్ సింగ్ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్

అయితే ఈ సినిమాకు సుప్రియా నిర్మాతగా వ్యవహరించడానికి ప్రధాన కారణం.. గూఢచారి సమయంలో నాగార్జున అక్కినేని సార్ చాలా సపోర్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఫ్రీగా షూట్ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చారు. అప్పడే చిన్న మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారు. రుణం తీర్చుకొనే అంశంలో భాగంగా ఈ సినిమాతో సుప్రియ భాగమయ్యారు. అప్పుడు నాకు ఇచ్చిన మొత్తం ఇప్పటి విలువతో పోల్చుకంటే చాలా ఎక్కువ అని అడవి శేష్ అన్నారు.

More from Filmibeat

Read more about: dacoit adivi sesh mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X