Breaking అజిత్ ఫ్యాన్స్‌కు నిరాశ.. వాలిమై మూవీ రిలీజ్ వాయిదా? కారణం ఏమిటంటే?
భారతీయ సినిమా పరిశ్రమపై కరోనావైరస్ ప్రభావం భారీగానే పడే అవకాశం కనిపిస్తున్నది. గత రెండేళ్లుగా లాక్‌డౌన్స్, కర్ఫ్యూలతో కుదేల్ అయిన సినీ పరిశ్రమలపై మరోసారి గట్టిదెబ్బ పడింది. సంక్రాంతి రేసులోకి దిగిన భారీ సినిమాలు, అగ్ర హీరోల చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. తాజాగా RRR, హిందీ జెర్సీ లాంటి చిత్రాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నాయి. తాజాగా ఖాతాలో తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన వలిమై చిత్ర విడుదల కూడా వాయిదా పడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
మూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ అజిత్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన నటించిన వాలిమై చిత్రం జనవరి 13న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ క్రమంలోనే తెలుగు వెర్షన్, తమిళ వెర్షన్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. తెలుగు పోస్టర్‌ను నాగచైతన్య రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే సినిమా విడుదలను వాయిదా వేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

చిత్ర యూనిట్‌కు సంబంధించిన కీలక వ్యక్తులు అందించిన సమాచారం ప్రకారం.. పొంగల్ బరి నుంచి వాలిమై తప్పుకొన్నది. తమిళనాడులో కరోనావైరస్ పరిస్థితులు విలయతాండవం చేస్తున్నాయి. థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయకతప్పలేదు. కరోనావైరస్ పరిస్థితుల సాధారణ స్థితికి చేరుకొన్న తర్వాత అజిత్ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు వెల్లడించినట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటనను విడుదల చేస్తారని తెలిసింది.
తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటే వాలిమై చిత్రం వేసవిలో రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుందనే సంకేతాలను సినీ వర్గాలు ఇచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ లేదా, కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రకటించిన తర్వాత వాలిమై టీమ్ తమ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ చిత్రం కూడా వాయిదా పడినట్టు సమాచారం. బాలీవుడ్‌లో ఇప్పటికే జెర్సీ చిత్ర రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











