అర్జున్ సర్జా ఇంట వరుస విషాదాలు… అవి మరువక ముందే మరోసారి!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరో అయిన ఆయన తెలుగులో కూడా అనేక స్ట్రైట్ సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. అయితే గత కొన్నాళ్లుగా ఆయన కుటుంబంలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆయన ఇంట మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు లోకి వెళ్తే

విశ్వక్ సేన్ హీరోగా
కన్నడ స్టార్ హీరో అర్జున్ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. అయితే గత కొన్నాళ్లుగా హీరోగా సినిమాలు తగ్గించిన ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించారు. అలాగే విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు ప్రస్తుతానికి ఆయన విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాకు ఆయన నిర్మాణం చేస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు.

హాస్పిటల్ లో చికిత్స
ఇక తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాల్లో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఇప్పుడు అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ తల్లి లక్ష్మీ దేవమ్మ అనారోగ్య కారణాలతో గత కొన్నాళ్లుగా బెంగళూరులోనే అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

అనారోగ్య కారణాలతో
అయితే ఆమె అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో అర్జున్ సర్జా కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిజానికి అర్జున్ కుటుంబంలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా కొన్నాళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. చిరంజీవి కన్నడ నాట ఒక స్టార్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో ఆయన కన్నుమూయడం అర్జున్ కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఇక ఆయన సోదరుడు ధ్రువ సర్జా ప్రస్తుతానికి కన్నడ సినీ పరిశ్రమలో హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మరిన్ని సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు.

మైసూరులో టీచర్ గా
అలాగే గత ఏడాది అర్జున్ మామ, కన్నడ నటుడు రాజేష్ కూడా అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో ఆ విషాద సంఘటనల నుంచి ఇంకా బయటకు కూడా రాక మునుపే అర్జున్ ఇంట మరోసారి విషాద సంఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు అర్జున్ అభిమానులకు బాధ కలిగిస్తుంది. ఇక అర్జున్ తల్లి వయసు ప్రస్తుతానికి 85 సంవత్సరాలు. ఆమె మైసూరులో టీచర్ గా తన జీవన ప్రస్థానం ప్రారంభించారు.

హీరోలుగా
ఇక అర్జున్ తండ్రిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన భర్తతో పాటే బెంగళూరు వచ్చారు. ఇక లక్ష్మీ దేవమ్మకు ఇద్దరు కుమారులు కాగా అందులో అర్జున్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించారు. ఇక అర్జున్ సోదరి కుమారులు అయిన చిరంజీవి సర్జా, ధృవ్ సర్జా కూడా కన్నడ నాట హీరోలుగా కొనసాగుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు చిరంజీవి సర్జా అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయనకు ఒక పండంటి కుమారుడు కూడా జన్మించాడు. ఇక ధ్రువ సర్జా ప్రస్తుతానికి కన్నడలో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పొగరు లాంటి సినిమాలతో ఆయన హిట్ అందుకున్నారు.


Click it and Unblock the Notifications











