Dulquer Salman: తల్లిదండ్రులపై దుల్కర్ సల్మాన్ షాకింగ్ పోస్ట్.. చూసిన వాళ్లంతా ఏమంటున్నారంటే?
దుల్కర్ సల్మాన్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అదిరిపోయే సినిమాలు చేస్తూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. ముఖ్యంగా తండ్రి మమ్ముట్టి అడుగు జాడల్లో నడుస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న ఈయన తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. తన తల్లిదండ్రుల గురించి అనేక విషయాలు వివరించారు. ఇది చూసిన వాళ్లంతా అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా.. ఆయన మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడు అని కూడా అందరికీ విధితమే. అయితే మమ్ముట్టి, సల్ఫాత్ లకు జన్మించిన ఈయన.. హీరోగా, సింగర్ గా, బిజినెస్ మేన్ గా కెరియర్ కొనసాగిస్తున్నారు. ఇలా క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉండే ఈయన తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో తన తల్లిదండ్రులు అయిన మమ్ముట్టి, సల్ఫాత్ ల ఫొటోలను షేర్ చేశారు. అలాగే వారిద్దరి పెళ్లి రోజు అని చెప్పి.. శుభాకాంక్షలు కూడా తెలిపారు.

మమ్ముట్టి, సల్ఫాత్ లకు ఈరోజు 45వ పెళ్లి రోజు. అందుకే దుల్కర్ సల్మాన్ వారికి శుభాకాంక్షలు చెబుతూ ఎమోలషనల్ అయ్యారు. ముఖ్యంగా "మీ ఇద్దరికీ 45 ఏళ్ల ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ స్వంత మార్గాల్లో మీరు మీ స్వంత ప్రపంచాన్ని సృష్టించారు. అలాగే దానిలో నన్ను కూడా భాగం చేసి ప్రేమను అందిస్తున్నందుకు నేను అదృష్టవంతుడిని" అని చెప్పుకొచ్చారు. అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా, నాన్న అంటూ తెలిపాడు. మీ ఇద్దరూ కలిసి ఎలాంటి అసాధారణమైన పనులను కూడా కలిసి చేయగలరు అంటూ చెప్పుకొచ్చాడు.
దుల్కర్ సల్మాన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ.. మమ్ముట్టి, సల్ఫాత్ లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరు ఎప్పుడూ ఇలాగే హాయిగా ఉండాలని కోరుకుంటున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా.. మరిన్ని అద్భుతమైన సినిమాలు తీస్తూ తండ్రీ, కొడుకులు మమ్మల్ని అలరించాలని కూడా పలువురు చెప్పుకొచ్చారు.
ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫఓర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











