రామ్ చరణ్ మూవీ పైరసీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం.. ఛాన్స్ దొరికితే కుక్కలమే!

సినిమాలు పైరసీకి గురి కావడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. పెద్ద హీరోలు, చిన్న హీరోలని తేడా లేకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో పడిన వెంటనే పైరసీ ప్రింటు మార్కెట్లోకి వస్తోంది. ఈ సినిమా పైరసీ ప్రధాన అంశంగా రూపొందుతున్న చిత్రం 'హీరో హీరోయిన్'. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరిగే పైరసీ గొడవను చూపించడం సంచలనం అయింది.

ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని సినిమా పైరసీ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ చిత్రానికి అడ్డా ఫేం జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర కథానాయకుడిగా, గాయత్రి సురేష్, పూజా జవేరి నాయికలు నటిస్తున్నారు. ఏ పైరేటెడ్ లవ్‌స్టోరీ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు.

రామ్ చరణ్ మూవీకి పైరసీ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్

రామ్ చరణ్ మూవీకి పైరసీ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్

మీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే... అంటూ హీరో నవీన్ చంద్ర చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. మా ఎన్టీఆర్ సినిమాను పైరసీ చేస్తావా? అంటూ కొందరు ఫ్యాన్స్ తనను కొట్టడానికి రావడంతో వారిని కూల్ చేయడానికి ‘వచ్చేవారం రామ్ చరణ్ మూవీ విడుదలవుతుంది. ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా' అని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నట్లు టీజర్లో చూపించారు.

ఛాన్స్ దొరికితే మేము కుక్కలమే

ఛాన్స్ దొరికితే మేము కుక్కలమే

హీరో హీరోయిన్ మధ్య వచ్చే మరో సీన్లో... ‘ప్రతి మగాడు ప్లేబాయే.. ఛాన్స్ దొరికితే మేము కుక్కలమే' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగులు యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ‘ఛీ..నీ ప్రేమ కూడా పైరసీయేరా' అంటూ హీరోయిన్ అసహ్యించుకున్నట్లు చూపించారు.

ప్రొడ్యూసర్ కూతురు అయితే ఏంటి?

ప్రొడ్యూసర్ కూతురు అయితే ఏంటి?

ప్రొడ్యూసర్ కూతురువు అయితే ఏంటే.. నిన్ను వదలను, పైరసీని వదలను అంటూ టీజర్ ఆసక్తికరంగా కట్ చేశారు. సినిమా మొత్తం పైరసీ, టాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతుందని స్పష్టమవుతోంది.

హీరో హీరోయిన్ టీజర్

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి, అభిమన్యు సింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్ రెడ్డి, షేకింగ్ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్‌చిక్ బబ్లూ, సారిక రామచంద్రరావు తదితరులు నటిసున్నారు.

సంగీతం: అనూప్ రూబెన్స్
ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వెంకట్ గంగాధరీ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి
ఫైట్స్: రియల్ సతీష్
నిర్మాత: భార్గవ్ మన్నె
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: జీయస్ కార్తీక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X