Jagapathi Babu:జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్.. ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ..!
జగపతి బాబు.. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి... అమ్మాయిల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు చేస్తూ.. మెప్పిస్తున్నాడు. ఇక ఆయన తాజాగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ నోట్ ను షేర్ చేశారు. అది చూసిన ఆయన ఫ్యాన్స్ తో పాటు.. నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. అసలు అందులో ఏం ఉంది.. అంతలా షాకింగ్ డెసిషన్ ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.
హీరోగా ఎన్నో సినిమాలు చేసి.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించిన జగపతి బాబు... ప్రస్తుతం విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తున్నారు. ఆయన ఒకప్పుడు సినిమా చేస్తే.. మినిమం గ్యారెంటీ అనుకునేవారు దర్శక నిర్మాతలు. అంతలా ఆయనకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇక ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా సినిమాలు మానేశాక... సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు.

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు... ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ అభిమానులపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఆయనకు తన అభిమానులపై మస్తు కోపం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అభిమానులు అంటే.. అందరు కాదు.. తనను ఇబ్బంది పెడుతున్న అభిమానులపై కోపం వ్యక్తంచేశారు. తన సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ నోట్ చేసి... తన కోపాన్ని, అసహానాన్ని వ్యక్తం చేశాడు జగ్గు భాయ్.
ఇక జగపతి బాబు రాసిన నోట్ లో... ''అందరికి నమస్కారం 33 ఏళ్లగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్యకారణంగా భావించాను. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాలుగుని వాళ్ళ కష్టాల్ని నా కష్టాలుగా భావించి వాళ్ళు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్మాను అంటూ రాసుకువచ్చారు.
కానీ బాధాకరణమయిన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ అయిపోయింది, నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కి నాకు సంబంధం లేదు విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడు తోడుగా ఉంటాను.... జీవించనివ్వండి... మీ జగపతి బాబు అంటూ సుదీర్ఘ నోట్ రాసుకువచ్చారు.
ఈ లెటర్ చూసిన నెటిజన్లు.. ఏమైందీ జగ్గు భాయ్ అంటూ కామెంట్స్ పెడుతుండగా... మరికొంత మంది లైక్స్ తో ఈ లెటర్ ను ట్రెండ్ చేస్తున్నారు. అభిమానం పేరుతో తనని ఎవరో మోసం చేసి ఉంటారని, అందుకే జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన లేఖ నెట్టింట్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











