Karthi: ఖైదీ2 ఆలస్యానికి కారణం అదేనట.. క్లారిటీ ఇచ్చిన హీరో కార్తీ!
2019లో కార్తీ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఖైదీ గురించి అందరికీ తెలిసిందే. అయితే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. కార్తీ, నరైన్, రమణ, హరీశ్ పేరడీ, జార్జ్ మార్యన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. తెలుగుతో పాటు తమిళంలో విడుదల అయిన ఈ సినిమాకు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ సినిమా హిట్టు కావడంతో లోకేష్ కనగరాజ్ దీనికి సీక్వెల్ మూవీ తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు.
అయితే ఖైదీ 2 సినిమా ప్రకటించి ఇప్పటికే చాలా కాలం అవుతున్నా.. షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో కార్తి ఫ్యాన్స్ ఫుల్ అప్సెట్ అయ్యారు. అయితే తాజాగా హీరో కార్తి కీలక పాత్రలో రాజు మురుగన్ దర్శకత్వంలో జపాన్ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో కార్తి సరసన అనూ ఇమాన్యుల్ హీరోయన్ గా నటించింది. ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా రాబోతుంది. నవంబర్ 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే హీరో కార్తికి ఖైదీ 2కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఖైదీ 2 గురించి స్పందించిన కార్తి.. ముందుగా అనుకున్నట్లుగా అయితే వచ్చే జనవరిలో షూటింగ్ ప్రారంభించాలని కానీ... ఇప్పుడే ఆ సినిమా షూటింగ్ ను ప్రారంభించట్లేదని వెల్లడించారు. మధ్యలో లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజినీ కాంత్ కాంబోలో సినిమా ఓకే అయిందని... అందుకే తమ సినిమాను మరికొంత కాలం వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే లోకేష్, రజినీ కాంత్ ల సినిమా పూర్తి అయిన వెంటనే ఖైదీ 2 ప్రాజెక్టు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ వల్లే ఈ సినిమా ఆలస్యం అవుతోందని.. తనను ఎప్పుడు షూటింగ్ కు రమ్మంటే అప్పుడు రెడీ అని చెప్పుకొచ్చారు.

అలాగే జపాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది చాలా ప్రత్యేకమైన, బలమైన కథ అని హీరో కార్తి వివరించాడు. ఈ కథ విన్నప్పుడే దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కచ్చితంగా ఉండాలని సూచించినట్లు కూడా వివరించాడు. అయితే అది ఉంటుందా లేదా అన్నది సినిమా చూస్తే అర్థం అవుతుందని... తాను ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తన హెయిల్ స్టైల్, డ్రెస్సులతో పాటు వాయిస్ కూడా మార్చినట్లు వెల్లడించారు. అలాగే జపాన్ సినిమా డార్క్ కామెడీ ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం కార్తి సూదుకవ్వం చిత్ర దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. అలాగే 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వివరించారు. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకం అని.. నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే తాను ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు వివరించారు. చూడాలి మరి చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి.. లోకేష్ కనగరాజ్ తో ఖైదీ 2 ఎప్పుడు చేస్తారో, అది ప్రజలకు ముందుకు ఎప్పుడు వస్తుందో అనేది.



Click it and Unblock the Notifications











