For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా రోజుల తరువాత షూటింగ్.. అందుకోసమే అలా అంటోన్న కార్తికేయ!!

    |

    ఆర్ ఎక్స్ 100 చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. ఆపై యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మాస్ సినిమాలను పట్టాలెక్కిస్తూ మళ్లీ సక్సెస్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరించి.. శరీరాకృతిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇక ఈ హీరో వేసే స్టెప్పులకు మాస్ ఆడియెన్స్ ఫిదా అవ్వాల్సిందే. చివరగా 90 ఎమ్ ఎల్ అంటూ దుమ్ములేపే స్టెప్పులను వేసి అందర్నీ మెప్పించాడు.

    ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. అంతా బాగుండి ఉంటే ఈ పాటికే తన కొత్త చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించేవాడు. అయితే కరోనా రావడంతో అంతా తారుమారైంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ బాడీపై శ్రద్ద పెట్టాడు. వ్యాయామం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కరోనా అవగాహన కార్యక్రమంలో చిరంజీవితో ఓ వీడియోను కూడా పంచుకున్నాడు. ఇక కార్తికేయ సెట్స్‌పైకి వెళ్లేందకు రెడీ అవుతున్నాడట.

    Hero Karthikeya ABout Chaavu Kaburu Challaga Shooting

    కార్తికేయ చేయబోతోన్న చావు కబురు చల్లగా అనే మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందట. ఈ మేరకు కార్తికేయ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత షూట్ స్టార్ట్ అవుతుంది.. అందుకే కెమెరా కొంచెం అలవాటు అవ్వాలని కొన్ని పోజులిచ్చాడు. ఈ మేరకు కార్తికేయ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కార్తికేయ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ రెడీ చేయబోతోన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Hero Karthikeya ABout Chaavu Kaburu Challaga Shooting, Chala Rojul tarvatha shoot start avthundi so konchm camera Alavatu avvalani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X