Don't Miss!
- News YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కార్తికేయ 90ML న్యూ లుక్ రిలీజ్.. టీజర్ ఎప్పుడో చెబుతూ కిక్
మొదటి సినిమా Rx100 తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు హీరో కార్తికేయ. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసిన ఆయన రెండో చిత్రం 'హిప్పీ'తో కాస్త నిరాశ చెందాడు. ఇక ఆ తర్వాత మళ్లీ 'గుణ 369' రూపంలో ఆయన చేసిన ప్రయత్నమూ సరైన సక్సెస్ సాధించలేక పోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ పట్టేయాలని, మరో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు కార్తికేయ.
శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి '90 ML' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేసి ఆసక్తి రేకెత్తించిన యూనిట్ సభ్యులు తాజాగా మరో లుక్ విడుదల చేసి టీజర్ వివరాలు కూడా చెప్పేశారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటల 35 నిమిషాలకి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నామని ఇందులో ప్రకటించారు.
90 ML అనే టైటిల్, విడుదల చేస్తున్న పోస్టర్స్ చూస్తుంటే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. టీజర్ ద్వారా సినిమాపై అంచనాలు రెట్టింపు చేయాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమా లోనూ నెగెటివ్ రోల్ పోషించి భేష్ అనిపించుకున్నాడు కార్తికేయ.