వెనుక నుంచి కాదు.. ముందు నుంచి చూడండి.. గుణ 369 హీరో ఫస్ట్‌లుక్ అదుర్స్

ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా రూపుదిద్దుకుంటున్న కొత్త సినిమా 'గుణ 369'. కార్తికేయ కెరీర్ లో మూడో ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'గుణ 369' అనే ఆసక్తికర టైటిల్ కన్ఫర్మ్ చేయడంతో సినిమాపై హోప్స్ పెరిగాయి. టైటిల్ లుక్ అంటూ ఇంతకుముందు హీరో కార్తికేయను వెనుక నుంచి చూపించి తమ కథలో కొత్తదనం ఉండనుందని అప్పుడే చెప్పేశారు. ఇక తాజాగా హీరో కార్తికేయ ఫుల్ ఫస్ట్‌లుక్ బయటకు వదిలి అంచనాలను రెట్టింపు చేసేశారు యూనిట్ సభ్యులు.

Hero Karthikeyas Guna 369 first look released

ఈ లుక్‌లో కార్తికేయ తన రెగ్యులర్ గెటప్‌కి డిఫరెంట్‌గా లుంగీ కట్టుకొని స్మైలీ లుక్‌తో కనిపించారు. పైగా ''ఇతను నిజమైన భావోద్వేగాలు కలిగిన పక్కా లోకల్ గై'' అని పేర్కొంటూ కార్తికేయ లుక్‌కి మరింత అందం తీసుకొచ్చింది చిత్ర యూనిట్. దీనిని బట్టి చిత్రంలో కార్తికేయ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో ఆకట్టుకోనున్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయం త్వరలో ప్రకటించనున్నారు.

తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 తోనే యువతకు బాగా దగ్గరయ్యాడు హీరో కార్తికేయ. ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయం ఆయన తదుపరి సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. రెండో సినిమాగా 'హిప్పీ' అనే డిఫెరెంట్ కథాంశాన్ని ఎంచుకున్న కార్తికేయ.. తన మూడో చిత్రంగా 'గుణ 369'ని లైన్‌ పెట్టేశాడు. ఇప్పటి వరకు వచ్చిన ఈ రెండు సినిమాల అప్‌డేట్స్‌ని చూస్తే వీటి విడుదల తర్వాత కార్తికేయ స్టార్ హీరో స్థాయి క్రేజ్ కొట్టేయడం ఖాయం అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X