Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
World of Bedurulanka 2012.. డీజే టిల్లు భామతో కార్తికేయ రొమాంటిక్‌గా.. యుగాంతం బ్యాక్ డ్రాప్‌తో..
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన బెదురులంక 2012 చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమవుతున్నది. తొలి చిత్ర దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన క్లాక్స్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రానికి రవీంద్ర బెనర్జీ, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సీ యువరాజ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్శంగా హీరో లుక్‌ను రిలీజ్ చేశారు. గోదావరి నదీ ప్రాంతంలోని ఎదురులంక గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లుక్‌ను వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012ను రిలీజ్ చేశారు.
యుగాంతం అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూర్తిస్థాయిలో గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రంగా రూపొందిస్తున్నాం. ప్రతీ సీన్, క్యారెక్టర్ ప్రేక్షకుడిని చివరి సీన్ వరకు ఆలరిస్తుంది అని నిర్మాతలు తెలిపారు.

సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రామ్ ప్రసాద్ క్యారెక్టర్లనూ దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. యుగాంతం వస్తుందని ఊరిలో ప్రజలు అందరూ ఎంజాయ్ చేసే విధానం నవ్వులు పూయించేలా ఉంది
'ఇదంతా సూతంటే నీకు ఏమనిపితంది' అని అజయ్ ఘోష్ అడిగితే 'మంచి ఫన్నీగా ఉంది' అని చెప్పాలనిపిస్తుంది. 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' ఎలా ఉంటుందో వీడియోలో చక్కగా చూపించారు.
చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. మా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. సినిమా బాగా వస్తున్నది. ప్రేక్షకులు అందరినీ నవ్వించే కొత్త తరహా చిత్రమిది. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' వీడియోలో చూశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అంత కంటే బావుంటాయి. మిగతా క్యారెక్టర్లు చేసే పనులు కూడా అంతే నవ్విస్తాయి. ప్రేక్షకుల నుంచి ఈ రోజు విడుదల చేసిన వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్, సినిమాను త్వరలో మీ ముందుకు తీసుకు రావాలని ఉంది అని చెప్పారు.
కార్తికేయ,
నేహా
శెట్టి,
అజయ్
ఘోష్,
రాజ్
కుమార్
కసిరెడ్డి,
శ్రీకాంత్
అయ్యంగార్,
'ఆటో'
రామ్
ప్రసాద్,
గోపరాజు
రమణ,
ఎల్బీ
శ్రీరామ్,
సత్య,
సురభి
ప్రభావతి,
కిట్టయ్య,
అనితానాథ్,
దివ్య
నార్ని
తదితరులు
సంగీతం:
మణిశర్మ,
సహ
నిర్మాతలు:
అవనీంద్ర
ఉపద్రష్ట,
వికాస్
గున్నల,
సమర్పణ:
సీ
యువరాజ్
నిర్మాత:
రవీంద్ర
బెనర్జీ
ముప్పానేని
రచన,
దర్శకత్వం:
క్లాక్స్
యాక్షన్:
అంజి,
పృథ్వీ
కాస్ట్యూమ్
డిజైనర్:
అనూషా
పుంజాల,
పి.ఆర్.ఓ:
పులగం
చిన్నారాయణ
ఎడిటింగ్:
విప్లవ్
న్యాసదం
సాహిత్యం:
సిరివెన్నెల
సీతారామశాస్త్రి,
కిట్టూ
విస్సాప్రగడ,
కృష్ణ
చైతన్య
ప్రొడక్షన్
డిజైన్:
సుధీర్
మాచర్ల
ఎగ్జిక్యూటివ్
నిర్మాత:
దుర్గారావు
గుండా
సినిమాటోగ్రఫీ:
సాయి
ప్రకాష్
ఉమ్మడిసింగు,
సన్నీ
కూరపాటి
కొరియోగ్రాఫర్:
బృంద,
మోయిన్