నా కోసం లగ్జరీ లైఫ్ వదిలేశాడు, సోదరుడి మృతిపై కిరణ్ అబ్బవరం ఎమోషనల్.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస మరణాలు చోటుచేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. సినీ ప్రముఖుల కుటుంబాల్లో ప్రముఖులు మరణ వార్తలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. దర్శకుడు నాగేశ్వరరావు డాన్స్ మాస్టర్ శివ శంకర్ మరణానంతరం గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా తనువు చాలించడంతో ప్రముఖులతో పాటు అభిమానులు కూడా చాలా బాధ పడ్డారు. ఇటీవల టాలీవుడ్ యువ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న కిరణ్ అబ్బవరం ఇంట్లో కూడా పెను విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలిచివేసింది. ఇక సోదరుడి మరణ వార్తపై కిరణ్ మొదటిసారి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

హీరోగా మంచి క్రేజ్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కిరణ్ 'రాజావారు రాణిగారు' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కిరణ్ అబ్బవరం ఆ తరువాత 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' చిత్రంతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే అతను సక్సెస్ అవ్వడానికి కారణం అతని కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎంతో ఉందట. ముఖ్యంగా సోదరుడు చాలా హెల్ప్ చేశాడని కిరణ్ తెలియజేశాడు.

అన్నయ్య మృతి..
ఇటీవల హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తన విజయలను చూస్తూ ఎంతగానో ప్రోత్సాహం ఇస్తున్న అన్నయ్య కన్నుమూయడంతో కిరణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

నా కోసం ఎన్నో త్యాగం చేశాడు.
కిరణ్ అబ్బవరం తన సోదరుడు మృతిపై మొదటిసారి సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా స్పందించారు. 'రేయ్ కిరణ్.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరం అయినా ఏదో ఒకటి గట్టిగా సాధించాలి రా.. అని తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేసే వాడు. నా కోసం ఎన్నో త్యాగం చేశాడు. తన లగ్జరీ లైఫ్ ను కూడా వదులుకున్నాడు. నన్ను హీరోగా చూడడం కోసం ఎన్నో చేశాడు.. అని కిరణ్ తెలిపాడు.

ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు
ఇక ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అనే టైంలోనే అతను లేకుండా వెళ్ళిపోయాడు. తను ఎప్పుడు అడిగే వాడు నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు రా అందరికీ అని.. ఇంకా ఏదైనా గట్టిగా సాధించిన తర్వాత పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. నా వెనక ఉన్నది మా అన్న రామంజులు రెడ్డి.. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. అని కిరణ్ అబ్బవరం తెలియజేశాడు.

వాళ్ళు తట్టుకోలేరు
ఇక తన కుటుంబంలో జరిగిన విషధాలు మరో కుటుంబంలో జరగకూడదు అనేలా కిరణ్ మరొక వివరణ ఇచ్చారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆనందం కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు. అది మీరు పొందకుండా పోతే వాళ్ళు తట్టుకోలేరు అంటూ కిరణ్ అబ్బవరం చాలా ఎమోషనల్ గా తన అన్నయ్య గురించి వివరణ ఇచ్చాడు.
Recommended Video

స్పందించిన తరుణ్ భాస్కర్
కిరణ్ అబ్బవరం ఇన్స్టాగ్రామ్ లో ఈ విధంగా పోస్ట్ చేయడంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఎమోషనల్ గా స్పందించారు. నీ మాటలు విన్నాక దిగ్భ్రాంతి, బాధ కలిగింది కిరణ్. మీరు మీ కోసం సోదరుల సైన్యాన్ని తయారు చేసుకున్నప్పటికీ, ఇది చాలా పెద్ద నష్టం. అతను మిమ్మల్ని అక్కడ నుంచి చూస్తున్నాడని, మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తున్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. అని వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











