బ్రేకింగ్ న్యూస్: మంచు మనోజ్ అరెస్ట్.. తిరుపతి పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో
సినీ నటుడు మంచు మనోజ్‌ను తిరుపతి పోలీసులు సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో కుటుంబ పరమైన, ఆస్తి పరమైన తగాదాలు కొనసాగుతున్నాయి. వారి మధ్య కలహాలు హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్, అలాగే కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై అటు మోహన్ బాబు.. అలాగే సోదరుడు విష్ణు వ్యవహరిస్తున్న తీరుపై మనోజ్ మండిపడటం తెలిసిందే.
గత రెండు నెలలుగా టీవీ సీరియల్‌గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది.

అయితే తాజాగా మరోసారి తిరుపతి చేరుకొన్న మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను బాకారావుపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మనోజ్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు అందాల్సి ఉన్నాయి. ఈ అరెస్ట్ గురించి బాకారావు పేట్ పోలీసులు అధికారికంగా సమాచారం వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











