twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naga Shourya: షూటింగ్ లో కళ్ళు తిరిగి పడిపోయిన యువ హీరో నాగ శౌర్య.. హాస్పిటల్ కు తరలింపు

    |

    టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన నాగశౌర్య ఇటీవల పెళ్లి వార్తతో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అతను ఒక వైపు సినిమాలో షూటింగ్స్ లో పాల్గొంటునే మరొకవైపు పెళ్లికి సంబంధించిన పనులలో కూడా నిమగ్నం అవుతున్నాడు. అయితే ఈ తరుణంలో నాగ శౌర్య సంబంధించిన ఒక వార్త ఒక్కసారిగా అందరిని షాక్ గురయ్యేలా చేసింది. అతను షూటింగ్లో ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కూడా తరలించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

    షూటింగ్ లో బిజీగా

    షూటింగ్ లో బిజీగా

    శివ హీరో నాగశౌర్య తెలుగు చిత్ర పరిశ్రమంలో మంచి నటుడిగా గుర్తింపు అందుకున్నాడు. అతను ఇటీవల కాలంలో సొంత ప్రొడక్షన్లో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అయితే నాకు శౌర్య గత కొన్ని రోజులుగా తీరిక లేకుండా అటు షూటింగ్లోనూ ఇటు పెళ్లికి సంబంధించిన పనుల్లోనూ బిజీగా కనిపిస్తున్నాడు. అయితే రీసెంట్ గా హఠాత్తుగా షూటింగ్లో అతను కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.

    హాస్పిటల్ కు తరలింపు

    హాస్పిటల్ కు తరలింపు

    ఉదయం నుంచి షూటింగ్లో చాలా బిజీగా ఉన్న నాగశౌర్య కొద్దిసేపటికి క్రితమే కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిలిపివేసి వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ లో నాగశౌర్యను జాయిన్ చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది సేపటి తర్వాత వైద్యులు కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు.

    ఆ కారణంగా..

    ఆ కారణంగా..

    నాగశౌర్య డిహైడ్రేట్ కారణంగానే షూటింగ్లో కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి అతను చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉండడం అలాగే సమయానికి ఆహారం కూడా తీసుకోకపోవడం వలన కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లడంతో వైద్యులు అతనికి చికిత్స అందించే మళ్లీ మామూలు పరిస్థితుల్లోకి తీసుకువచ్చారు.

    రేపు డిశ్చార్జ్

    రేపు డిశ్చార్జ్

    ఇక డిహైడ్రేషన్ కారణం వల్లనే నాగశౌర్య కింద పడిపోయినట్లుగా వైద్యులు చెప్పడంతో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని ఇక అతన్ని రేపు డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు చెప్పడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

    త్వరలో పెళ్లి

    త్వరలో పెళ్లి

    ఇక నాగశౌర్య ఇటీవల పెళ్లి గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతను అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 20వ తేదీన బెంగళూరులో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. అది కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనుంది. నాగ శౌర్య ఒక వైపు షూటింగ్ పనుల్లో పాల్గొంటూనే మరోవైపు పెళ్లి పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు.

    English summary
    Hero naga shourya admitted to hospital latest health update
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X