కృష్ణ వ్రింద విహారి పాదయాత్ర

రొటీన్ కు భిన్నమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు హీరో నాగశౌర్య. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు కొత్త దనం అందించాలని పరితపించే అతి కొద్ది మంది యాక్టర్స్ లో ఒకడైన శౌర్య తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా జనాల అంచనాలను మించిపోయిందనే చెప్పాలి. భారీ ఎక్స్ పెక్టేషన్స్ నడుమ విడుదలకు సిద్ధమవుతున్న 'క్రిష్ణ వ్రింద విహారి' టీమ్ ఇప్పుడు మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టబోతోందట.

ఈ నెల 23న 'కృష్ణ వ్రింద విహారి' విడుదల్వబోతున్న సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో పాదయాత్ర నిర్వహించబోతున్నారట చిత్ర బృందం. సెంటిమెంటల్ గా 14వ తారీఖున తిరుపతిలో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్కడి నుంచి 15వ తారీఖున నెల్లూరు, ఒంగోలులోనూ, 16న విజయవాడ, గుంటూరు, ఏలూరు, 17న భీమవరం, రాజమండ్రి, 18న కాకినాడ, విశాఖపట్నంలో పాదయాత్ర నిర్వహించనున్నారు.

Hero Naga Shourya to kick start Padayatra for his new film

ఈ యాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కిన 'కృష్ణ వ్రింద విహారి'కి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు. షెర్లీ సేటియా హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక శౌర్య తల్లిగా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ లో శౌర్య సూపర్ ఇన్నోసెంట్ కుర్రాడిలా కనిపించబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాలో వెన్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తమదైన స్టైల్ లో అలరించబోతున్నారని అర్ధమవుతోంది. సినిమాలో కీలకమైన పాయింట్ ను ట్రైలర్ లో రివీల్ చేయకుండా గట్టి ప్రయత్నమే జరిగింది కాబట్టి, అదే సప్రైజ్ ఎలిమెంట్ అయి ఉండవచ్చని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. మహతి స్వరసాగర్ అందించిన స్వరాలు కూడా ఆహ్లాదంగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి అని చెప్పాలి. మరి సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కృష్ణ వ్రింద విహారి' ఈ అంచనాలను అందుకుంటాడని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X