నానితో విశ్వక్ సేన్ గొడవ.. అందుకే ‘హిట్’ నుంచి ఔట్.. నేచురల్ స్టార్ క్లారిటీ
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ లో తన వరల్డ్ ను నిర్మించుకుంటున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నాని ప్రస్తుతం కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. మరోవైపు యువ నటీనటులను కూడా తన సినిమాలు, తను నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న చిత్రాల్లో అవకాశాలు అందిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో నాని 100 శాతం సక్సెస్ అవుతున్నారు. రీసెంట్ గా 'కోర్టు' అనే చిత్రాన్ని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై విడుదల చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
ఇక మరోవైపు తను కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తన సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. చివరిగా 'దసరా', 'సరిపోదా శనివారం' వంటి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న హిట్ సిరీస్ (HIT Series)తో రాబోతున్నారు. హిట్ : ది థర్డ్ కేసు చిత్రంతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

హిట్ : ది థర్డ్ కేసు చిత్రం మే1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. నానినే నిర్మించిన చిత్రం కావడంతో సినిమాను మరింత జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలో తాజాగా విశ్వక్ సేన్ తో గొడవ అంటూ కొన్నాళ్లుగా ఓ వార్త వైరల్ గా మారింది. విశ్వక్ సేన్ తో ఘర్షణ ఏర్పడం వల్లే నాని హిట్ : సెకండ్ కేసు లో అడివి శేష్ ను తీసుకొచ్చారని ఓ రూమర్ గట్టిగానే ప్రచారమైంది. తాజాగా దానిపై నాని స్పందించారు. క్లారిటీ ఇచ్చారు.
హిట్ సిరీస్ ను డిజైన్ చేసింది ఒక్క హీరో కోసం చేసేందుకు కాదు. అందులో మల్టీపుల్ స్టార్స్ కనిపిస్తారు. విశ్వక్ సేన్ తో ఎలాంటి గొడవ లేదు. సినిమా కథ రాక ముందే విశ్వక్ తో హిట్ సినిమా ఫిక్స్ అయ్యింది. కానీ స్క్రిప్ట్ లాక్ అయ్యాక కథ పెద్దగా మారిపోయింది. దాంతో హిట్ వర్స్ గా మారిపోయింది. అక్కడ జరిగింది అంతే. లేదంటే అడివి శేష్ సెకండ్ కేసు లోకి తీసుకొచ్చే వాళ్లమే కాదు. మళ్లీ థర్డ్ కేసు లో నేను వచ్చే వాడిని కాదు. మున్ముందు మళ్లీ విశ్వక్, శేష్ కూడా తిరిగి వస్తారేమో వేచి చూడాలని చెప్పుకొచ్చారు.
ఇక తన ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మిస్తానని, ప్రమోట్ చేస్తానని చెప్పారు. తను బాలీవుడ్ ఆడియెన్స్ కోసం, అక్కడ క్రేజ్ కోసం ఎదురు చూడటం లేదని చెప్పారు. హిందీ మార్కెట్లో నేను ఫెయిల్ అయ్యానని చాలా మంది అన్నారు. కానీ నేను అక్కడ తెలుగు సినిమాల సత్తాను చూపించాలనుకున్నాని చెప్పారు. ఇక హిట్ 3 చిత్రాన్ని శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











