నా నుంచి మీ అయింది ఈరోజే.. పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ: నాని ఎమోషనల్ ట్వీట్
నాని.. తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు వారి మనసు దోచిన యంగ్ హీరో. స్వయంకృషితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ అని కూడా బిరుదును దక్కించుకున్నాడు. నటన, బావోద్వేగాలు పండించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ యంగ్ హీరో కెరీర్ మంచిగానే సాగిపోతోంది. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక, తాజాగా నాని తన కెరీర్ గురించి ఓ ట్వీట్ చేశాడు. దీనికి కారణం అతడి మొదటి సినిమా 'అష్టా చమ్మా' విడుదలై గురువారానికి పదకొండు సంవత్సరాలు కావడమే. దీనిని ప్రస్తావిస్తూ తన ట్విట్టర్‌లో 'అష్టా - చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.... నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు. ఇంత పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం. ఇంకా మరిన్ని సంవత్సరాల పాటు ఈ అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నా' అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు నానికి కంగ్రాట్స్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











