Ind Vs Aus నా గుండె ముక్కలైంది.. భారత్ ఓటమిపై నాని ట్వీట్ వైరల్

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ దారుణంగా ఓటమి పాలవ్వడం జీర్ణించుకోలేని విషయంగా మారింది. వరల్డ్ కప్ చేజారడంతో భారతీయులందరూ ఓ రకమైన దిగ్బ్రాంతికి, విషాదానికి గురవుతున్నారు. అయితే భారత్ విజయాన్ని ప్రత్యక్షంగా కన్నులారా చూడాలని వెళ్లిన ప్రతీ ఒక్కరికి తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే భారత్ ఓటమిపై నేచురల్ స్టార్ నాని చేసిన ట్విట్ అభిమానులను మరింత బాధకు గురిచేసింది. నాని చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..

ఆహ్మాదాబాద్‌లోని మోడీ స్టేడియలో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు దాదాపు 1.3 లక్షల మంది హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది సినీ ప్రముఖులు మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లారు. అందులో వెంకటేష్, అఖిల్, నాని లాంటి ప్రముఖులు ఉన్నారు. బాలీవుడ్ నుంచి కూడా భారీగా తరలివచ్చారు.

 Hero Nani tweet goes viral after India looses Match Against Australia in World Cup

అయితే నేచురల్ స్టార్ నాని కూడా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. ఆ వేదిక ద్వారా తాను నటించిన పాన్ ఇండియా మూవీ.. హాయ్ నాన్న ప్రమోషన్ చేసేందుకు వెళ్లారు. హాయ్ నాన్న సినిమాను హిందీ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హాయ్ నాన్న సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఆహ్మాదాబాద్‌లో భారత్, ఆసీస్ మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో నాని సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సల్మాన్‌తో నాని తన భావాలను పంచుకొన్నారు. సల్మాన్, నాని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 Hero Nani tweet goes viral after India looses Match Against Australia in World Cup

అయితే భారత్ విజయం సాధిస్తుందనే ఫీలింగ్‌ అందరీలోనూ బలంగా ఉంది. అలానే నాని కూడా విజయం సాధించాలని కోరుకొన్నాడు. కానీ భారత్ దారుణమైన ఓటమి గురికావడం నేచురల్ స్టార్‌ను గుండె కోతకు గురిచేసింది. భారత్ ఓటమిపై తన బాధను ట్విట్టర్‌లో వెళ్లగక్కాడు.

నాని ట్వీట్ చేస్తూ.. అందరి ఆశలు అడియాసలు అయ్యాయి. నా గుండె ముక్కలైంది అంటూ ట్వీట్ చేశారు. పగిలిన గుండె ఈమోజీని పోస్టు చేశారు. నాని చేసిన పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X