RX100 హీరో కార్తీకేయకు నాని సపోర్ట్.. నేచురల్ స్టార్ చేతుల మీదుగా హిప్పీ టీజర్
RX 100 ఘన విజయం తర్వాత క్రేజీ హీరోగా మారిన కార్తికేయ తన తదుపరి చిత్రం హిప్పీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, స్టిల్స్ యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచుతున్నాయి. ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న హంగామా కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరో మ్యాజిక్ చోటుచేసుకోబోతున్నది.
హిప్పీ చిత్రానికి సంబంధించిన టీజర్ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఆవిష్కరింపబోతుంది. ఈ సినిమా టీజర్‌ను మార్చి 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు నాని ఆవిష్కరించనున్నారు.

హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటిస్తున్నది. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











