1800 కోట్ల సినిమా.. నారా రోహిత్ ఎందుకు వదులుకున్నాడు.. ఏం జరిగిందో తెలుసా?
నారా రోహిత్ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీయర్ బిగినింగ్ లో ఆయన సినిమాలు ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉండేవి. పైగా రోహిత్ గొప్పింటి నుంచి వచ్చినా ఎక్కడా అది కనిపించకుండా చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఆయన సింప్లిసిటీతోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇదిలా ఉంటే.. నారా రోహిత్ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. 3 రోజుల్లో 'భైరవం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
నారా రోహిత్ ను మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్..
నారా రోహిత్ కెరీయర్ లో చెప్పుకోదగ్గ సినిమాలంటే ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. సోలో, ప్రతినిధి. అంతకు ముందు ఆ తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక చివరిగా వచ్చిన 'ప్రతినిధి 2', 'సుందరకాండ' వంటి చిత్రాలు కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే నారా రోహిత్ 2018 వరకు వరుస పెట్టి సినిమాలు చేశారు. మధ్యలో కరోనా రావడంతో సినిమాలు చేయడం ఆపేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో నారా రోహిత్ కు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందంట.

టాలీవుడ్ సెన్సేషనల్, బ్లాక్ బాస్టర్ సినిమా 'పుష్ప : ది రైజ్'లో విలన్ పాత్రలో నటించే అవకాశం మొదట నారా రోహిత్ కే దక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత తొలుత బన్వార్ లాల్ సింగ్ షికావాత్ పాత్రకు రోహిత్ నే అనుకున్నారంట. తన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా చెప్పారంట. కానీ ఎందుకు ఆ తర్వాత సెట్ కాకపోవంతో నారా రోహిత్ చేయలేకపోయాడంట. అలా ఆ ఛాన్స్ మిస్ అయ్యిందంట. ఒక వేళ ఇప్పుడు నారా రోహిత్ ఆ సినిమా చేసి ఉంటే మాత్రం టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉండే వాడని అంటున్నారు.
పుష్ప2 ది రూల్ కలెక్షన్లు..
2021లో పుష్ప ది రైజ్ చిత్రం విడుదలైంది. ఆ ఏడాదిన్నరకు ముందే షూటింగ్ ప్రారంభమైంది. అప్పుడు రోహిత్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఒక వేళ అల్లు అర్జున్ కు విలన్ గా నారా రోహిత్ నటించి ఉంటే మాత్రం ఆయన కెరీయర్ కు మైలేజ్ ఉండేదని అంటున్నారు. ఇక ఈ ఏడాది వచ్చిన పుష్ప 2 ది రూల్ ఏకంగా రూ.1870 కోట్ల గ్రాస్ వసూల్ చేసి ఇండియాలోనే హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన 2వ చిత్రంగా రికార్డులోకి ఎక్కింది. ఇలాంటి సెన్సేషన్ ప్రాజెక్ట్ ను నారా రోహిత్ వదులుకోవడం హాట్ టాపిక్ గ్గా మారింది.
భైరవం సినిమా విడుదల ఎప్పుడు?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రమే భైరవం. నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. మే 30న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను టీమ్ జోరుగా నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications











