Tollywood Drugs Case: యువ హీరోకు షాక్...ఈడీ విచారణకు హాజరు?
గత కొంత కాలంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసింది. ఇక ఈ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారని తెలుస్తుంది. ఇక డ్రగ్ పెడ్లర్స్ తో ఆయనకు ఉన్న సంబంధాలపై అధికారులు విచారణ జరపనున్నారు. మరోవైపు ఆయన బ్యాంక్ లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేయనున్నారు. అసలు ఈ డ్రగ్స్ కేసు ఏంటి... నవదీప్ ఈడీ ముందుకు ఎందుకు హాజరు కానున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2017 నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మళ్ళీ ఈ కేసు తెర మీదకు వచ్చింది. ఇక ఈ కేసులో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కేసులో నవదీప్ పేరు బయటకు వచ్చింది. ఇక ఈ యువ హీరోకు ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 2017లోనే డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్ ను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు.

ఇక నవదీప్ నుంచి సరైన వివరాలు రాకపోవడంతో.. మరోసారి ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. దీంతో ఆయన నేడు ఈడీ ముందుట హాజరయినట్లు తెలుస్తోంది. ఇక ఈడీ అధికారులు యువ హీరో నవదీప్ ను ప్రశ్నిస్తున్నారు. ఆయనపై ఈ కేసు విషయంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై నవదీప్ ఏం సమాధానం చెబుతాడో చూడాలి.
ఇక నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఈ కేసులో 29వ నిందితుడిగా అతని పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నైజీరియన్ లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కు పంపించారు. వీరిలో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. నవదీప్ జరిపిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

నార్కోటిక్ పోలీసులను ఈడీ అధికారులు... మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. డ్రగ్ పెడ్లర్లు, బ్యాంకు లావాదేవీలతో నవదీప్ కు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. నవదీప్ విచారణలో నోరువిప్పుతే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ హీరోతో నోరువిప్పిస్తే.. ప్రముఖులు బయటకు రానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











