Navadeep: మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే.. ఎవరెవరు ఏం చేశారో చెప్పిన నవదీప్!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నవదీప్ గురించి తెలుగు సినీ ప్రేక్షుకలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథలతో అనేక చిత్రాలు చేస్తూ సందడి చేసే ఈయన ఈ మధ్య అనేక సినిమాల్లో లీడ్ క్యారెక్టర్లలో కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈయన హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడే మెగా హీరోల గురించి మాట్లాడుతూ అనేక షాకింగ్ కామెంట్లు చేశారు. మెగా హీరోలు అంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లేనని వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోగా రాబోతున్న తాజా చిత్రమే ఆపరేషన్ వాలెంటైన్. అయితే ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమాను మార్చి 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవదీప్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ అనేక షాకింగ్ కామెంట్లు చేశారు.

మెగా హీరోలు అంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అని... చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మన మెగా ఫ్యామిలి గురించి మాట్లాడుకోవాలంటే.. అంటూ వారి గురించి వివరించే ప్రయత్నం చేశాడు. మన సౌత్ ఇండియాలో మొట్టమొదటగా.. సిక్స్ ప్యాక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలిపారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సరదాగా.. గ్లోబల్ స్టేజీ మీదకు వెళ్లిపోయారని వివరించారు. అలాగే ఇప్పుడు కాదు అప్పుడు కాదు... ఎప్పుడైనా అలాంటి వాడు వెనక్కి వస్తే చూడాలనుకునే పవన్ కల్యాణ్ అంటూ పవర్ స్టార్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

ఇన్ని సంవత్సరలా నుంచి ఇన్న దేశ భక్తి చిత్రాలు, ఇన్ని మిల్ట్రీ సినిమాలు వచ్చినా... తెలుగులో ఫస్ట్ టైమ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న మా వరుణ్ తేజ్ అంటూ వెల్లడించాడు నవదీప్. ఇక ఈ సినిమా ట్రైలర్ లో చివరలో వచ్చిన వర్డ్.. నువ్వు నా రేడార్ లో ఉండగా.. నీకేం కాదని చెప్పి అది వరుణ్ క్యారెక్టర్ చెప్పింది అమ్మాయికే అయినా వాళ్ల ఫ్యామిలీ రేడార్ లో మీ ఫ్యాన్స్ అంతా ఉండగా.. ఏమీ కాదని నా ఉద్దేశ్యం అంటూ వెల్లడించాడు.

ఇదంతా ఇలా ఉండగా... వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో.. 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, రుహానీ శర్మ, నవదీప్ తదితరులు కీలక పాత్రలను చేశారు. అలాగే ఈ చిత్రాన్ని మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. చూడాలి మరి మార్చి ఒకటో తేదీన రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకోనుందో.


Click it and Unblock the Notifications











