Navdeep: డ్రగ్స్ కేసులో నా ప్రమేయమే లేదు.. కానీ నన్నే ముందు తీసుకెళ్లడానికి కారణం అదే!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నవ్ దీప్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన ఒకప్పుడు హీరోగా చేసి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. కీలక పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించి మెప్పించిన ఈయన తాజాగా డ్రగ్స్ కేసులో తన ప్రేమయం గురించి చెప్పి షాకిచ్చాడు. అందుకే తననే ముందుగా అరెస్ట్ చేస్తారంటూ అసలు విషయం వెల్లడించాడు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు 2017 సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా వినిపించే పేర్లలో హీరో నవ్ దీప్ పేరు ఒకటి. ఈ కేసులో భాగంగానే గతేడాది నవ్ దీప్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే 2017లోనే డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్ ను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. కానీ సరైన వివరాలు రాకపవడంతో.. ఆయన గతేడాది అక్టోబర్ లో మరోసారి విచారించారు. ఈడీ ఎదుట హాజరైన ఈయన వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇక ఆ తర్వాత నుంచి ఈ కేసు గురించి పెద్దగా వార్తలు రాలేదు. కానీ తాజాగా హీరో నవ్ దీప్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను.. డ్రగ్స్ కేసు గురించి అడగ్గా.. సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తనకు ఈ కేసుతో ఉన్న ప్రేమయం గురించి క్లుప్తంగా వివరించాడు. ప్రతీసారి తననే ముందు అరెస్ట్ చేయడం, విచారణకు పిలవడం గురించి కూడా చెప్పుకొచ్చారు. అందుకు తగిన ఉదాహరణలను కూడా ప్రస్తావించారు.
పాఠశాలలో ఏదైనా తరగతి గదిలో గొడవ జరిగితే ప్రతీసారి ప్రిన్సిపాల్ వచ్చి చివరి బెంచ్ విద్యార్థిని తీసుకు వెళ్లినట్లుగానే.. డ్రగ్స్ కేసు ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి తనను విచారణకు తీసుకు వెళ్తారని హీరో నవ్ దీప్ వివరించారు. అలా ప్రతీసారి వాళ్లు తీసుకెళ్లడం, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, తిరిగి రావడం జరుగుతుందని.. కానీ తనకెప్పుడూ ఈ కేసుతో సంబంధం లేదని వివరించారు. తన ప్రేమయం లేకపోయినా తాను ప్రతీసారి విచారణకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

హీరో నవ్ దీప్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మందికి ఈయనకు అండగా నిలుస్తుండగా.. మరికొంత మంది మాత్రం నువ్వు తప్పు చేయకుండానే... విచారణకు వెళ్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో... ఈ కేసుకు పెద్దగా విచారణ అవసరం లేదని... ఇలాంటివి జరిగిన ప్రతీసారి పోలీసులు ఓం రాసినట్టు నవ్ దీప్ పేరు రాస్తారని తెలిపారు. మరి ఈ కేసుతో నిజంగానే నవ్ దీప్ కు సంబంధం ఉందా లేదా అని తేల్చాల్సింది మాత్రం ఈడీ అధికారులే. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











