Navdeep: ఈసారి నన్ను వదిలేశారు.. రేవ్ పార్టీ అంటే ఇదే.. ఎప్పుడు వెళ్లానంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నవ్ దీప్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన ఒకప్పుడు హీరోగా చేసి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. కీలక పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. తాజాగా లవ్ మౌళి అనే సినిమా చేసిన ఈయన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడే రేవ్ పార్టీ గురించి మాట్లాడి షాకిచ్చాడు. ముఖ్యంగా రేవ్ పార్టీ అంటే అసలైనా అర్థం ఏంటో కూడా చెప్పారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన సినీ నటులు అందరిపై ఉచ్చు బిగుసుకుంటోంది. ముఖ్యంగా పార్టీకి హాజరైన వారందరికీ టెస్టులు నిర్వహించడంతో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ చేశారు. వీరిలో నటి హేమ కూడా ఉంది. అయితే తెలుగు సినీ రంగానికి సంబంధించి ఎలాంటి కేసు వచ్చినా ముందుగా హీరో నవ్ దీప్ ది వినిపిస్తూ ఉంటుంది. కానీ తొలిసారి ఆయన పేరు లేకుండా రేవ్ పార్టీ కేసు వెలుగులోకి రావడం గమనార్హం. అయితే తాజాగా ఆయన లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు.

సినిమా గురించి మాట్లాడిన తర్వాత ఓ మీడియా ప్రతినిధి హీరో నవ్ దీప్ ను రేవ్ పార్టీ అంటే, మీరు ఎప్పుడైనా వెళ్లారా అని అడిగారు. అలాగే తొలిసారి మీ పేరు లేకుండా ఈ కేసు వెలుగులోకి వచ్చింది.. దీనిపై మీ స్పందన ఏంటంటూ ప్రశ్నించాడు. అయితే వీటన్నిటికీ నవ్ దీప్ సమాధానం చెప్పాడు. రేవ్ పార్టీ అంటే.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారని, ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారని చెప్పుకొచ్చారు. రేవ్ పార్టీ అంటే ఏం చెప్పాలి, ఏం చెప్పాలి అని తెగ ఆలోచించి మరీ.. రేయి పగలు చేసుకునేదే రేవ్ పార్టీ అని వెల్లడించారు.
అలాగే తాను ఈ దేశంలో ఎప్పుడూ వెళ్లలేదని హీరో నవ్ దీప్ వివరించారు. అంటే ఇతర దేశాల్లో ఆయన ఇలాంటి పార్టీలకు హాజరు అయ్యారని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఇలాంటి వార్తలు రావడం.. అందులో తన పేరు ప్రస్తావించకపోవడం చాలా సంతోషంగా ఉందని.. ఈ ఒక్కసారైనా వదిలేశారని వివరించారు. ఈసారి చాలా మంది నిరుత్సాహపడొచ్చని సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇలాంటి ప్రశ్నలే అడుగుతూ.. నవ్ దీప్ ను రియాక్ట్ అవ్వమని కోరుతున్నారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడగా.. ఈ వీడియో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











