చికెన్ ఓ ఎమోషన్ అంటున్న సగిలేటి కథ.. హీరో నవదీప్ సమర్పణలో రాయలసీమ భావోద్వేగాలు
హీరో నవదీప్ సమర్పణలో రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో పక్కా తెలుగు నేటివిటీతో రూపొందుతున్న చిత్రం సగిలేటి కథ. సీ స్పేస్ బ్యానర్‌పై ఆశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. సగిలేటి కథ సినిమా ద్వారా రవితేజ మహాదాస్యం, విషిక కోట యువ హీరో, హీరోయిన్లు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాయలసీమ ప్రాంతంలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తుల మధ్య జరిగే నాటకీయ పరిణామాల మధ్య భావోద్వేగంగా సాగే సినిమా. తెలుగు నేటివిటితో నిజాయితీగా కథను చెప్పే ప్రత్నం చేశాం. ప్రతీ పాత్ర చాలా నేచురల్‌గా మీ మనసుకు హత్తుకొంటుంది. ఈ చిత్రంలో చికెన్ అనే అంశం స్పెషల్ ఎట్రాక్షన్. చికెన్ అంటే కూర, ఫ్రై అనే విషయంగా చెప్పలేదు. ఓ ఎమోషనల్ పాయింట్‌గా చెప్పాం. రాయలసీమ సాంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించే సినిమా అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

షేడ్ స్టూడియో అధినేతలు షేడ్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై కనబడుటలేదు అనే చిత్రాన్ని నిర్మించారు. నూతన నటీనటులను పరిచయం చేసే ఈ టీమ్ మరోసారి సగిలేటి కథ ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఎమోషనల్ పాయింట్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సగిలేటి కథ కేవలం ఓ సినిమా కాదు. ఓ జీవితాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. ప్రతీ సన్నివేశం, పాత్ర ఆకట్టుకొని కొత్త అనుభూతికి గురిచేస్తుంది అని టీమ్ పేర్కొన్నది. ఈ నెల 31 వ తారీకు ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.

నటీనటులు: రవితేజ మహాదాస్యం, విషిక కోట తదితరులు
రచన, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, దర్శకత్వం: రాజశేఖర్ సుద్మూన్
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ బాబు మాదినేని
సంగీతం: జశ్వంత్ పసుపులేటి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సనల్ వాసుదేవ్
ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జీ, ఐశ్వర్య కులకర్ణి
లిరిక్స్: వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని
పీఆరోవో: తిరుమలశెట్టి వెంకటేష్
పబ్లిసిటీ డిజైనర్: యమ్ కే యస్ మనోజ్


Click it and Unblock the Notifications











