twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందీప్ కిషన్ బాధ చూసి.. నిర్మాతగా మారుదామనుకొన్నా.. హీరో నిఖిల్

    |

    సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదల కానుంది. బుధవారం రాత్రి హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. యువ హీరోలు నిఖిల్, సుధీర్ బాబు ముఖ్య అతిథులుగా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ, 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' ఫేమ్ విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు.

    నిఖిల్ మాట్లాడుతూ "సందీప్ కిషన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. సినిమా యాక్టర్ల మధ్య కాంపిటీషన్ ఉంటుందని, వాళ్ల సినిమాల గురించి వీళ్లు మాట్లాడుకుంటారనేవి మధ్యలో మనుషులు చెప్పే విషయాలని సందీప్ కిష‌న్‌ని క‌లిసిన త‌ర్వాత అర్థ‌మైంది. మేం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు. ఒక్కసారి మాట్లాడటం మొదలుపెట్టిన తరవాత మాటలు ఆగలేదు. ఆడియో ఫంక్ష‌న్స్‌కి అంటే నాకు భ‌యం. వస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ, ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి వ‌స్తాన‌ని నేనే సందీప్ కిష‌న్‌కి కాల్ చేశా.

     Hero Nikhil about Sandeep Kishan pain

    నిను వీడని నీడను నేనే సినిమా విషయానికి వస్తే... 'వెన్నెల' కిషోర్‌తో నా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు క్యాజువల్‌గా మూవీ బాగా వస్తుందని చెప్పాడు. కొంతమందికి కాల్ చేశా. అందరూ బాగా వస్తుందని చెప్పారు. వెంటనే సందీప్ కిష‌న్‌కి ఫోన్ చేసి 'నేను కూడా నీ సినిమాలో ప్రొడ్యూస‌ర్‌గా జాయిన్ అవ్వొచ్చా?' అని అడిగా. సాధారణంగా నేను డబ్బులు పెట్టడానికి ఆలోచిస్తా. కానీ, టాక్ విని డబ్బులు పెట్టాలనుకున్నా. చాలామంది నిర్మాతలు ఉన్నారని చెప్పాడు. జీవితంలో మనం కింద పడతాం. పైకి లేస్తాం. ఎప్పుడూ డిజప్పాయింట్ అవ్వకూడదు. ఈ సినిమా తరవాత సందీప్ కిషన్‌పైన ఉంటాడు. తను పైకి లేచే టైమ్ మొదలైంది. ఎవరూ ఆపలేరు" అని అన్నారు.

    కాగా, గెస్టులుగా హాజరైన హీరోలకు సినిమా సెకండ్ టికెట్‌ను సందీప్ కిషన్ అందజేశారు. సెంటిమెంట్‌గా ఫ‌స్ట్ టికెట్ ఎవ‌రికి ఇస్తామ‌నేది గురువారం చెబుతామ‌ని సందీప్ తెలిపారు. ఈ ఫంక్ష‌న్‌ను 'జె మీడియా ఫ్యాక్టరీ' నరేంద్ర ఆర్గనైజ్ చేశారు. మంజుష, భార్గవ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు, APR ప్రాజెక్ట్స్ అధినేత సంజీవ్ రెడ్డిగారు, టైల్స్ మార్ట్ అధినేత జగ్గారావుగారు, సుప్రియగారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

    English summary
    Ahead of the release of 'Ninu Veedani Needanu Nene' on July 12, Sundeep Kishan talks about the movie, what makes it so different, why it's not a regular horror flick, why he turned a producer and more. In NVNN pre release event, Vishwak Sen speak to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X