చెక్ సినిమాలో చించేశారు.. చంద్రశేఖర్ ఏలేటి అద్భుతంగా తీశారు.. హీరో నితిన్

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా 'చెక్‌'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు. 'ఐతే...' తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి, కల్యాణీ మాలిక్‌ కాంబినేషన్‌ మళ్లీ 'చెక్‌'కి కుదిరింది. ఈ చిత్రం ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. చెక్ సినిమా సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఒక డిఫరెంట్ సినిమా చేయాలని అనుకొంటున్న సమయంలో భవ్య క్రియేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ అన్నె రవి గారు వచ్చి చంద్రశేఖర్ ఏలేటి వద్ద ఓ కథ ఉంది వింటారా అని అడిగారు. కథ విన్న తర్వాత 15 నిమిషాల్లోనే ఒకే చెప్పాను. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉండే సినిమా. నేను ఇప్పటి వరకు రొమాంటిక్, యాక్షన్ సినిమాలు చేశాను. కానీ చెక్ సినిమా నా కెరీర్‌లో విభిన్నమైనది. ఈ చిత్రంలో నేను ఉరిశిక్ష పడిన ఖైదీగా నటిస్తున్నాను. దాదాపు ఈ సినిమా మొత్తం జైలులోనే సాగుతుంది. జైలు సెట్, లుక్ అంతా రియలిస్టిక్‌గా ఉంటుంది.

 Hero Nithiin about Check movie and Chandra Sekhar Eleti

ఈ సినిమాలోని పాత్ర నాపై ప్రభావం చూపింది. ఇంటికి వెళ్లినా ఆ పాత్ర తాలుకు ప్రభావం ఉంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నన్ను డిఫరెంట్‌గా చూపించాడు. తెలుగు సినిమా రంగంలో చెక్ సినిమా డిఫరెంట్ సినిమా మారుతుందని బలంగా నమ్ముతున్నాను. ఇక కల్యాణీ మాలిక్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ చించేశారు. ఒకే పాట ఉన్నప్పటికీ చాలా బాగుంది. మేము నటించి ఈ సినిమా ఓ లెవెల్‌కు తీసుకెళ్తే కల్యాణీ మాలిక్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారు అని నితిన్ అన్నారు.

చంద్రశేఖర్ ఏలేటి మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ చెక్ సినిమాతో ముందుకు వచ్చాను. ఈ సినిమా అద్భుతంగా రావడానికి నిర్మాత ఆనంద్ ప్రసాద్, హీరో నితిన్ కారణం. ప్రతి విషయంలో నాకు సపోర్టుగా ఉండి ప్రోత్సహించారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు నితిన్ పెర్ఫార్మెన్స్ గురించి తప్పకుండా మాట్లాడుకొంటారు. సాయిచంద్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి ప్రతిభ గొప్పగా ఉంటుంది. కల్యాణీ మాలిక్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. కొత్త పాయింట్‌తో రూపొందించినప్పటికీ.. అన్ని కమర్షియల్ వ్యాల్యూస్ ఉంటాయి అని అన్నారు.

నిర్మాత వీ ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. భవ్య క్రియేషన్స్‌లో 12వ సినిమాగా చెక్ వస్తున్నది. ఫిబ్రవరి 26వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. మమల్ని ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. లాక్‌డౌన్‌లో రిలీజైన ఓ పిట్టకథ, మిడిల్ క్లాస్ మెలోడిస్ మంచి విజయాన్ని సాధించాయి. అలాగే చెక్ సినిమా కూడా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌కు మంచి విజయాన్ని సాధించిపెడుతుంది. నాకు ఇష్టమైన డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి రూపొందించారు. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా నటించిన నితిన్ ఈ సినిమాలో చేసిన పెర్ఫెర్మెన్స్ మరో లెవెల్ ఉంది. ఆయన నటన గురించి సువర్ణాక్షరాలతో రాసుకొవచ్చని నేను చెబుతున్నాను. ఈ సినిమాను రిలీజ్ రోజున వచ్చి చూడమని నేను ఈ వేదిక మీద నుంచి ఆహ్వానం అందిస్తున్నాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X