గురూజీ.. మాటల్లో చెప్పలేను.. అంటూ త్రివిక్రమ్‌పై నితిన్ ఎమోషనల్ పోస్ట్
యువ హీరో నితిన్ వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ఆయన నటించిన భీష్మ మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. అదే క్రమంలో తాను ప్రేమించిన శాలినితో వివాహం కూడా పక్కా అయింది. ఈ క్రమంలో నితిన్ మంచి జోష్‌లో ముందుకెళ్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఆయన నటించిన భీష్మ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిరవ్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో త్రివిక్రమ్ గురించి నితిన్ ఎమోషనల్‌గా స్పందించారు.
నా గురూజీ త్రివిక్రమ్‌తో నాకు ఉన్న సాన్నిహిత్యం ఏర్పడటం గొప్ప విషయంగా భావిస్తాను. ఆయనను ఎంత అభిమానిస్తానో.. ఎంతగా ఇష్టపడుతానో మాటల్లో చెప్పలేను. మా సక్సెస్ కోసం ఆయన భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని దీవించబోతున్నారని చెప్పడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అని నితిన్ ట్వీట్ చేశారు.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ చిత్రంలో నితిన్ నటించిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలుగా రూపొందించిన ఛల్ మోహన రంగ చిత్రంలో నితిన్ నటించారు.

కాగా, ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా 'భీష్మ'లో హీరోయిన్‌గా నటించారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











