Macherla Niyojakavargam నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్..బ్లాక్‌బస్టర్ సక్సెస్ కారణం అదే..నితిన్ ఎమోషనల్ స్పీచ్
యువ హీరో నితిన్, అందాల భామ కృతిశెట్టి నటించిన మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం భారీ సక్సెస్‌ను అందుకుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఎడిటర్ ఎస్ఎమ్ శేఖర్ (ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి) దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాచర్ల నియోజకవర్గం చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని భారీ విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో నితిన్ మాట్లాడుతూ..

నా జోనర్ మార్చి యాక్షన్‌కు
మాచర్ల నియోజకవర్గం సినిమా ఆదరించి భారీ విజయాన్ని అందించినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. నా కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నమ్మాను. ఈ సినిమా విషయానికి వస్తే.. జోనర్ మార్చి యాక్షన్ జోనర్‌కు వెళ్లాను. సినిమాను ప్రేక్షకుల మధ్య చూశాను. సినిమాలో కామెడీ సీన్లకు ప్రేక్షకుల చప్పట్లు నాకు ఆనందాన్ని ఇచ్చాయి. యాక్షన్ సీన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వెన్నెల కిషోర్ కామెడీకి మంచి స్పందన కనిపించింది. నా లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది అని నితిన్ అన్నారు.

భారీ ఓపెనింగ్ రావడం
నా కెరీర్‌లో ఇంత పెద్ద ఓపెనింగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకుల ఆదరణను బాధ్యతగా స్వీకరించి ఇక ముందు మంచి సినిమాలు చేస్తాను. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక వర్గానికి థ్యాంక్స్. ఈ సినిమాకు మహతి సాగర్ అందించిన పాటలు పెద్ద అస్సెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని నితిన్ పేర్కొన్నారు.

నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్
నిర్మాత, నితిన్ సోదరి నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజై రెండో రోజు. తొలి రోజు షేర్ అద్బుతంగా ఉంది. ఏపీ, తెలంగాణలో 10 కోట్లకుపైగా కలెక్షన్లు ఉన్నాయి. నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. పాండమిక్ తర్వాత ఇలాంటి ఓపెనింగ్స్ మా సినిమాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. తొలి రోజు ఈవెనింగ్ షోకు టాక్ పెరిగి మంచి ఆక్యుపెన్సీ లభించింది. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు ధన్యవాదాలు అని అన్నారు

లాంగ్ వీకెండ్‌తో మరింతగా
మాచర్ల సినిమా కోసం టెక్నికల్ టీమ్ చాలా కష్టపడ్డారు. దాని ఫలితమే థియేటర్ రెస్పాన్స్ బట్టి తెలుస్తున్నది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు కూడా బాగా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్ ఉంది. లాంగ్ వీకెండ్ కూడా ఉంది. ఇక ముందు కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని నిఖితారెడ్డి అన్నారు.

తొలి రోజు 10 కోట్ల గ్రాస్‌తో
మాచర్ల నియోజకవర్గం సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు హైర్స్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియావైడ్ ఈ చిత్రం 4.96 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. దాంతో నితిన్ కెరీర్‌లోనే అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











