నితిన్ ఫస్ట్ కమర్షియల్ యాడ్ వచ్చేసింది.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సీనియర్ నటి ప్రగతితో కలిసి..
టాలీవుడ్ హీరోలు కమర్షియల్ యాడ్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఎంతో మంది హీరోలు లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు వివిధ రకాల కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల హీరో నితిన్ కూడా ఒక యాడ్ కోసం షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. నితిన్ మొదటి యాడ్ కావడంతో మంచి క్రేజ్ అందించిన యాడ్ షూట్ . మునుపెన్నడు లేనంతగా నితిన్ చాలా కూల్ అండ్ స్టయిలిష్ గా చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అప్పుడే క్లారిటీ ఇచ్చిన నితిన్
నితిన్ ఆ మధ్య కొన్ని ఫొటోలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొనబోతున్నట్లు క్లారటి ఇచ్చాడు. కానీ ఎలాంటి యాడ్ అనే దానిపై అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఎదో ఇంటర్నేషనల్ కంపెనీకి ప్రచారం చేయబోతున్నట్లు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణంగా నితిన్ ఇంతవరకు యాడ్స్ లో పెద్దగా నటించింది లేదు.

ది చికెన్ ఆంథమ్
ఇక యాడ్ ను విడుదల చేయగా.. హైదరాబాద్ స్నేహ చికెన్ సంస్థలో కాస్ట్లీ యాడ్ లో నటించినట్లు అర్ధమయ్యింది. సీనియర్ నటి ప్రగతి కూడా ఈ యాడ్ షూట్ లో తల్లి పాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. స్నేహ చికెన్ - ది చికెన్ ఆంథమ్' అనే పేరుతో విడుదలైన ఈ యాడ్ లో.. అమ్మలెప్పుడు ఇంతేనండి. మనం ఎక్కడున్నా ఏంచేస్తున్నా ఒకటే ప్రశ్న.. 'తిన్నావా?' అని. ఆ ప్రశ్నకు స్నేహ ఫ్రెష్ చికెన్ బదులైతే ప్రతి అమ్మకి ఇక పండగే'' అంటూ అద్భుతమైన కొటేషన్ తో యాడ్ ను హైలెట్ చేశారు.
యాడ్ ని డైరెక్ట్ చేసింది ఎవరంటే..
ఇక యాడ్ ను షూట్ చేసింది మరెవరో కాదు.. 'సాహో' కో రైటర్ అలాగే అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనిల్ కుమార్ ఉపాధ్యాయుల డైరెక్ట్ చేశాడు. మెస్మరైజింగ్ విజువల్స్ తో స్టైలిష్ గా ఉండేలా యాడ్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ యాడ్ కోసం నితిన్ పారితోషికం కూడా గట్టిగానే అందుకున్నాడట. ఇక మిడియామ్ రేంజ్ హీరోలలో ఇప్పుడు నితిన్ కూడా యాడ్స్ షూట్స్ లలో గట్టి పోటీని ఇవ్వగలడని క్లారిటీ వచ్చేసింది.
Recommended Video

ఆ మూడు సినిమాలతి బిజీ కానున్న నితిన్
ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా నితిన్ 'ఛెక్' అనే మరో డిఫరెంట్ మైండ్ గేమ్ లాంటి సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు అందాదున్ రీమేక్ ను కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.


Click it and Unblock the Notifications











