twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫ్2 సీక్వెల్‌లో రవితేజకి బదులుగా నితిన్!

    |

    విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 ఇప్పటికీ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. దాదాపు 80 కోట్ల షేర్ సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఎఫ్2 నిలిచింది.చాలా కాలం తర్వాత వెంకటేష్ కామిక్ రోల్ లో చెలరేగిపోయి నటించాడు. వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా చేసిన రచ్చని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

    ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎఫ్2 సీక్వెల్ లో మూడో హీరో కూడా నటించబోతున్నాడని, అది రవితేజనే అని ప్రచారం జరిగింది. తాజాగా యంగ్ హీరో నితిన్ పేరు వినిపిస్తోంది. దిల్ రాజు నితిన్ ని ఎఫ్2 సీక్వెల్ లో తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. దీనితో అనిల్ రావిపూడి, దిల్ రాజు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

    Hero Nithiin in Venkatesh, Varun Tejs F2 movie sequel

    ఎఫ్2 లో ఇద్దరు హీరోలతోనే ఇంత కామెడీ పండించిన అనిల్ రావిపూడి, ఇక ముగ్గురు హీరోలతో ఎలాంటి రచ్చ చేయిస్తాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ తో ఓ చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మించనున్నారు.

    English summary
    Hero Nithiin in Venkatesh, Varun Tej's F2 movie sequel
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X